Viral Video: భవనం కూల్చివేతలో అపశృతి.. హఠాత్తుగా పక్కకు విరిగి పడిపోయిన వైనం
బహుళ అంతస్తు భవనాలను నిర్మించడానికి పట్టే సమయం, శ్రమ, ఖర్చు భారీగానే ఉంటుంది. ఐతే వీటిని నేల కూల్చడానికి కొన్ని క్షణాలు చాలు. టెక్నాలజీ పుణ్యమా అని పెద్ద పెద్ద ఆకాశ హర్మ్యాలను క్షణాల్లో నేలకూల్చేస్తున్నారు నేటి ఇంజనీర్లు. ఐతే ఈ వీడియోలో..
బహుళ అంతస్తు భవనాలను నిర్మించడానికి పట్టే సమయం, శ్రమ, ఖర్చు భారీగానే ఉంటుంది. ఐతే వీటిని నేల కూల్చడానికి కొన్ని క్షణాలు చాలు. టెక్నాలజీ పుణ్యమా అని పెద్ద పెద్ద ఆకాశ హర్మ్యాలను క్షణాల్లో నేలకూల్చేస్తున్నారు నేటి ఇంజనీర్లు. టెక్సాస్‌లోని ఓషన్ టవర్ (2009), ల్యాండ్‌మార్క్ టవర్, యూరప్‌లోని ఏఎఫ్‌ఈ టవర్, మీనా ప్లాజా, పవర్‌స్టేషన్ వెస్టర్న్ హోస్ట్ వంటి ఎన్నో భవనాలను ఇలాగే నేల కూల్చారు. ఐతే వీటిని నేల కూల్చేటప్పుడు పక్కనున్న భవనాలపై పడకుండా ఉన్నచోటే కుప్పకూలేలా పర్‌ఫెక్ట్‌గా ప్లాన్ చేస్తారు. పేలుడు పదార్ధాలు, యంత్రాల ద్వారా ఇలా నేలమట్టం చేస్తారు. వీటిని లైవ్‌లో వీక్షించేందుకు వేల కొద్ది జనం కూడా తరలివస్తుంటారు. భవన వ్యర్ధాల నుంచి వెలువడే దుమ్ము, శబ్దం వంటి ఇతర కారకాలు చుట్టుపక్కల ఉండే వారికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి.
ఐతే ఈ వీడియోలో ఉన్న భవనం మాత్రం నిలువునా కిందకు పడిపోకుండా పక్కకు ఒరిగి పడిపోయింది. దీంతో అక్కడున్నవారు ప్రాణ భయంతో పరుగులు తీయడం వీడియోలో చూడొచ్చు. తృటిలో అక్కడున్నవారికి ప్రమాదం తప్పింది. లేదంటే భవనం వారిపై పడి ఉండేది. కర్ణాటకలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
— Structural Failures (@CollapseVids) April 8, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.