Atal Pension Yojana: కేంద్రం షాకింగ్ నిర్ణయం.. అక్టోబర్ 1 నుంచి వారికి ఆ పథకం వర్తించదు..!

Atal Pension Yojana: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అటల్ పెన్షన్ యోజన పథకం వర్తింపులో సవరణలు చేసింది.

Atal Pension Yojana: కేంద్రం షాకింగ్ నిర్ణయం.. అక్టోబర్ 1 నుంచి వారికి ఆ పథకం వర్తించదు..!
Atal Pension Yojana
Follow us

|

Updated on: Aug 13, 2022 | 1:10 PM

Atal Pension Yojana: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అటల్ పెన్షన్ యోజన పథకం వర్తింపులో సవరణలు చేసింది. ఈ పథకం ప్రయోజనాలు పేద, వెనుకబడిన వారికి మాత్రమే దక్కేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఈ పెన్షన్ వర్తించకుండా నిబంధనల్లో సవరణలు చేసింది. అక్టోబర్ 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. పథకం యొక్క ప్రయోజనాలు పేద మరియు వెనుకబడిన వారికి చేరేలా చూసేందుకు, ఆదాయపు పన్ను చెల్లింపుదారుగా ఉన్న లేదా ఉన్న ఏ పౌరుడైనా ఈ సంవత్సరం అక్టోబర్ 1 నుండి అటల్ పెన్షన్ యోజన (APY)లో చేరడానికి అర్హులు కాదని ప్రభుత్వం ప్రకటించింది.

అటల్ పెన్షన్ యోజన(APY) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015 లో ప్రారంభించింది. 18 నుండి 40 సంవత్సరాల వయస్సు గల దేశ పౌరులకు ఇది ఒక సామాజిక భద్రతా పథకం. చందాదారులు, వారి చందాల ఆధారంగా, 60 ఏళ్లు నిండిన తర్వాత ప్రతి నెలా రూ. 1,000 నుండి రూ. 5,000 వరకు గ్యారెంటీ నెలవారీ పెన్షన్‌ను పొందుతారు. ఈ పథకం మొదట్లో అందరికీ వర్తింపజేశారు. ప్రస్తుతం ఇందులో సవరణలు తీసుకువచ్చారు. పేదలకు మాత్రమే ఇది వర్తింపజేయాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగానే.. ఆదాయపు పన్ను చెల్లించే వారిని ఈ పథకం నుంచి తొలగించాలని నిర్ణయించింది.

అక్టోబర్‌ 1వ తేదీ తరువాత ఈ పథకం చేరిన ఆదాయపు పన్ను చెల్లింపు దారుల APY ఖాతాలను మూసివేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు చెల్లించిన వారి ఖాతాలను కూడా తొలగించడం జరుగుతుంది. అలాగే ఇప్పటి వరకు వారు చెల్లించిన మొత్తాన్ని తిరిగి వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది అని కేంద్రం ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

‘‘ఆదాయపు పన్ను చెల్లింపుదారు అంటే ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం కాలానుగుణంగా సవరించబడిన ఆదాయపు పన్ను చెల్లించాల్సిన బాధ్యత కలిగిన వ్యక్తి అని అర్థం’’ ని గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొంది కేంద్రం. కాగా, అటల్ పెన్షన్ యోజనకు చేసిన కంట్రిబ్యూషన్ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80CCD (1B) కింద రూ. 50,000 వరకు ఆదాయపు పన్ను మినహాయింపునకు అర్హత ఉంటుంది. ఇక సెక్షన్ 80C కింద అనుమతించబడిన ఆర్థిక సంవత్సరానికి రూ. 1.5 లక్షల కంటే ఎక్కువ పన్ను మినహాయింపు ఉంటుంది.

అటల్ పెన్షన్ యోజన కేంద్ర ప్రభుత్వ పథకం. ఇది అసంఘటిత రంగంలో ఉన్న వ్యక్తులకు, వారి పదవీ విరమణ తర్వాత ఆదాయ భద్రతను అందిస్తుంది. చందాదారులు చెల్లించిన మొత్తంపై నెలవారి పెన్షన్ సొమ్ము ఆధారపడి ఉంటుంది. అంటే 60 సంవత్సరాల వయస్సు తర్వాత రూ. 1,000 నుండి రూ. 5,000 వరకు నెలవారీ పెన్షన్‌ లభిస్తుంది. APYకి కంట్రిబ్యూషన్ చెల్లింపు మూడు విధానాలలో చేయవచ్చు. నెలవారీ, త్రైమాసిక, అర్ధ-సంవత్సరంలా చెల్లించవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్టంగా 40 సంవత్సరాలు. ఈ పథకం నుంచి విరమించుకోవడం అనేది అసాధారణమైన పరిస్థితులలో అంటే, మరణించినప్పుడు గానీ, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడినప్పు గానీ అనుమతిస్తుంది. చందాదారుడు మరణించిన సందర్భంలో, పెన్షన్ మొత్తాన్ని వారి జీవిత భాగస్వామికి చెల్లిస్తారు. చందాదారుడు, జీవిత భాగస్వామి ఇద్దరూ మరణించిన సందర్భంలో, 60 సంవత్సరాల వయస్సు వరకు సేకరించిన పెన్షన్ సంపద నామినీకి తిరిగి ఇవ్వబడుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..