Sonia Gandhi – Corona: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి మళ్లీ కరోనా పాజిటివ్..
Sonia Gandhi - Corona: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మళ్లీ కరోనా బారిన పడ్డారు. తాజాగా నిర్వహించిన టెస్టుల్లో కరోనా మరోసారి కరోనా పాజిటివ్‌గా తేలింది.
Sonia Gandhi – Corona: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మళ్లీ కరోనా బారిన పడ్డారు. తాజాగా నిర్వహించిన టెస్టుల్లో కరోనా మరోసారి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేష్ వెల్లడించారు. ట్విట్టర్ ద్వారా వివరాలను వెల్లడించిన జైరామ్ రమేష్.. ‘సోనియా గాంధీకి కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆమె ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది.’ అని పేర్కొన్నారు.
కాగా, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి గత జూన్ నెలలో కూడా కరోనా బారిన పడ్డారు. దాంతో ఆమె ఆస్పత్రిలో చేరికి చికిత్స పొందారు. కొద్దిరోజులకు కోలుకున్న ఆమె.. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో కీలక వివరాలను అధికారులకు చెప్పినట్లు సమాచారం. కాగా, ఇవాళ మళ్లీ ఆమె కరోనా బారిన పడటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న సోనియా గాంధీకి.. మరోసారి కరోనా పాజిటివ్ రావడంతో టెన్షన్‌కు గురవుతున్నారు పార్టీ శ్రేణులు. సోనియా గాంధీ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
Congress interim president Sonia Gandhi tests positive for #COVID19 again; party MP and General Secretary in-charge Communications Jairam Ramesh tweets, “She will remain in isolation as per Govt. protocol.” pic.twitter.com/tXQySNTVCj
— ANI (@ANI) August 13, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..