Viral: వామ్మో.. వాయమ్మో.. లిక్కర్ కోసం ఎంత పని చేశారయ్యా.. ఏం చేశారో తెలిస్తే మైండ్ బ్లాంకే!
కొంతమంది మందుబాబులకు చుక్క లేకపోతే ముద్ద దిగదు. ఇలాంటి వారు ఎప్పుడూ మద్యం దుకాణాల దగ్గరే ఉంటారు.
కొంతమంది మందుబాబులకు చుక్క లేకపోతే ముద్ద దిగదు. ఇలాంటి వారు ఎప్పుడూ మద్యం దుకాణాల దగ్గరే ఉంటారు. అయితే ఇప్పుడు మేము చెప్పబోయే మందుబాబులు నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. మద్యం కోసం వీరు ఏం చేశారో చూస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే.. లేట్ ఎందుకు ఆ కథేంటో చూసేద్దాం..
వివరాల్లోకి వెళ్తే.. అది పూణేలోని సస్వాద్ రోడ్.. అక్కడ స్థానికంగా ఉన్న ఓ మద్యం దుకాణాన్ని ఓపెన్ చేసేందుకు సిబ్బంది ఉదయాన్నే వచ్చారు. సీన్ కట్ చేస్తే.. షాప్ గోడకు ఓ పెద్ద రంధ్రం ఉంది. లోపలికి వెళ్లి చూడగా అంతా చిందరవందరగా పడి ఉన్నాయి. దాంతో వారికి దొంగతనం జరిగిందని అర్ధమైంది. ఈ ఘటన ఆగష్టు 8వ తేదీన వెలుగులోకి రాగా.. పూణే పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
ఆ షాప్ నుంచి వివిధ బ్రాండుల మద్యం బాటిళ్ళతో కూడిన 120 బాక్సులను కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించారని పోలీసులు చెప్పారు. వాటి విలువ సుమారు రూ. 12.65 లక్షలు విలువ చేస్తుందని అంచనా. ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయమేంటంటే.. తాము దొరికిపోతామేమోననుకున్న ఆ దొంగలు.. ఏకంగా సీసీటీవీ కెమెరాలకు సంబంధించిన డిజిటల్ వీడియో రికార్డర్‌ను సైతం ఎత్తుకెళ్ళారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై షాప్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. కాగా, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..