Viral Photo: ఈ బాతుల మధ్య మొసలి దాగుంది.. ఎక్కడుందో గుర్తించగలరా! కనిపెడితే మీరే ఖతర్నాక్!
ప్రతీ రోజూ సరికొత్త ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు ఇంటర్నెట్‌లో మనకు తారసపడుతుంటాయి. ఇవి పిల్లల నుంచి పెద్దల వరకు..
ప్రతీ రోజూ సరికొత్త ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు ఇంటర్నెట్‌లో మనకు తారసపడుతుంటాయి. ఇవి పిల్లల నుంచి పెద్దల వరకు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తాయి. అలాగే ఎంతోమంది నెటిజన్లు ఇలాంటి పజిల్స్‌ను తగ్గేదేలే అన్నట్లుగా ఓ పట్టుపడతారు. ఈ కోవలోనే ఓ ఫోటో పజిల్ ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి అదేంటో చూసేద్దాం..
పైన పేర్కొన్న ఫోటోను మీరు చూసినట్లయితే.. అందులో ఎక్కడ చూసినా బాతులు ఉండటాన్ని గమనించవచ్చు. ఇక అదే బాతుల సమూహం మధ్య ఓ మొసలి దాగుంది. దాన్ని మీరు గుర్తించాలి. చాలామంది నెటిజన్లు ఈ పజిల్ సాల్వ్ చేయలేక.. చేతులెత్తేశారు. నూటికి 99 మంది కష్టం అని పేర్కొన్నారు. మరి మీ ఐ పవర్ సంగతేంటి.? 15 సెకన్లలో మీరు మొసలిని గుర్తిస్తే.. మీది జీనియస్ బుర్ర.. లేట్ ఎందుకు ఓసారి ప్రయత్నించండి.. ఎంత వెతికినా సమాధానం దొరక్కపోతే కింద ఫోటో చూడండి..
here is the answer pic.twitter.com/JqhVmJo799
— telugufunworld (@telugufunworld) August 13, 2022
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..