Assam: అస్సాంలో దారుణం.. జీన్స్ ధరించిందని యువతిపై షాపు యజమాని దాడి..

Assam: స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లకు పైగా అయింది. అయితే ఆడవారు అర్ధరాత్రి కూడా నిర్భయంగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు..

Assam: అస్సాంలో దారుణం.. జీన్స్ ధరించిందని యువతిపై షాపు యజమాని దాడి..
Assam Man
Follow us
Surya Kala

|

Updated on: Nov 01, 2021 | 5:34 PM

Assam: స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లకు పైగా అయింది. అయితే ఆడవారు అర్ధరాత్రి కూడా నిర్భయంగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు అని గాంధీ  చెప్పారు.  అయితే ప్రస్తుతం పరిస్థితులు అర్ధరాత్రి తిరగడం మాట అటు ఉంచి పగలు కూడా దైర్యంగా తిరగలేని పరిస్థితులున్నాయి. ఇక కట్టుకునే బట్టలను ఎంచుకునే స్వేచ్ఛ మహిళలకు లేదనే విషయం మరోసారి ఈ విషయం రుజువు చేస్తుంది. జీన్స్ ధరించి తన షాపులోకి వచ్చిన అమ్మాయిని అవమానించి అసభ్యంగా ప్రవర్తించి తన షాపునుంచి గెంటేశాడు.. ఈ దారుణ ఘటన అస్సాంలోని బిస్వనాథ్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

బిస్వనాథ్ జిల్లాలోని చారియాలిలోని మొబైల్ ఫోన్ యాక్సెసరీస్ అమ్మే దుకాణంలోకి ఓ బాలిక ఇయర్‌ఫోన్స్ కొనేందుకు వెళ్ళింది. అయితే ఆ బాలికను షాప్ యజమాని నూరుల్ అమీన్ అసభ్య పదజాలంతో దూషించాడు. బురఖాకు బదులుగా జీన్స్ ధరించినందుకు అమ్మాయిని అవమానపరిచాడు. అంతేకాదు నేను నీకు నా షాపులోని వస్తువులను అమ్మను అంటూ ఆ బాలికను అవమానిస్తూ.. షాప్ నుంచి బలవంతంగా బయటకు గెంటేశాడు.

ఇదే విషయం ఆ బాలిక స్పందిస్తూ.. తాను మొబైల్ షాపు కి వెళ్ళినప్పుడు ఆ షాపు యజమాని నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. అంతేకాదు మళ్ళీ ఎప్పుడూ నా షాప్ కి రావద్దంటూ బయకు వెళ్లమని గెంటేశాడు.. నువ్వు జీన్స్ వచ్చావు.. బురఖా వేసుకోలేదు.. నిన్ను చూసి.. మా ఇంట్లోని ఆడవాళ్లు కూడా ఇక నుంచి నీకులా తయారవుతూ అంటూ నోటికి వచ్చినట్లు తిట్టాడని తెలిపింది. ఆ వృద్ధుడు ప్రవర్తనను అతని కుటుంబం చూస్తూనే ఉంది. అయినప్పటికీ ఎవరూ వరించలేదు.. తప్పని చెప్పలేదని వాపోయింది ఆ బాలిక .

అమ్మాయి ఇంటికి తిరిగి వచ్చి తన తల్లిదండ్రులతో  షాప్ యజమాని చేసిన దాడి గురించి చెప్పింది. దీంతో తల్లిదండ్రులు బాలిక ని తీసుకుని దుకాణం వద్దకు వెళ్లారు. అప్పుడు దుకాణదారుని ఇద్దరు కుమారు కుటుంబ సభ్యులు మళ్ళీ బాలిక తండ్రిపై దాడికి పాల్పడ్డారు.  దీంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read :  నాగ శౌర్య ఫార్మ్ హౌస్ పేకాట కేసు.. ఎఫ్ఐఆర్ కాఫీ.. వివరాల్లోకి వెళ్తే..