AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Assaduddin Owaisi: ‘టిప్పు సుల్తాన్‌’ వివాదంపై స్పందించిన అసదుద్దీన్‌.. దమ్ముంటే తనను చంపాలంటూ సవాల్‌

రాష్ట్ర బీజేపీ చీఫ్‌ నళిన్‌ కుమార్‌ కటీల్‌ వ్యాఖ్యలు కాక పుట్టిస్తున్నాయి. టిప్పు సుల్తాన్‌ అనుచరులను చంపేయాలంటూ ఆయన చేసిన కామెంట్స్‌ మరోసారి వివాదాస్పదంగా మారాయి.

Assaduddin Owaisi: 'టిప్పు సుల్తాన్‌' వివాదంపై స్పందించిన అసదుద్దీన్‌.. దమ్ముంటే తనను చంపాలంటూ సవాల్‌
Assaduddin Owaisi
Basha Shek
|

Updated on: Feb 16, 2023 | 3:28 PM

Share

అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటకలో మళ్లీ టిప్పు సుల్తాన్‌ వివాదం రాజుకుంది. శ్రీరామ్‌-హనుమాన్‌ భక్తుల పాలన కావాలా ? టిప్పుసుల్తాన్‌ వారసుల పాలన కావాలా ? అంటూ బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టింది. రాష్ట్ర బీజేపీ చీఫ్‌ నళిన్‌ కుమార్‌ కటీల్‌ వ్యాఖ్యలు కాక పుట్టిస్తున్నాయి. టిప్పు సుల్తాన్‌ అనుచరులను చంపేయాలంటూ ఆయన చేసిన కామెంట్స్‌ మరోసారి వివాదాస్పదంగా మారాయి. ఈ సందర్భంగా రామ భక్తులు, హనుమంతుడిని ప్రార్థించేవారు మాత్రమే ఇక్కడ ఉండాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నళిన్‌ కుమార్‌ కటీల్‌. టిప్పు వారసులను అడవుల్లోకి తరిమికొట్టాలంటూ యలబుర్గలో చేసిన కామెంట్స్‌ కాంట్రవర్సీకి కారణమయ్యాయి. ఈ రాష్ట్రంలో హనుమాన్‌ భక్తులుండాలా..? టిప్పు వారసులుండాలా..? అంటూ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన కటీల్‌..టిప్పు అనుచరులు ఈ నేలపై సజీవంగా ఉండకూడదంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. టిప్పుసుల్తాన్‌ పేరు ఎత్తిన వాళ్లను తరిమేయాలన్న కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు నళిన్‌ కుమార్‌ కటీల్‌కు సవాల్‌ విసిరారు మజ్లిస్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ

దమ్ముంటే నన్ను చంపండి: ఒవైసీ

. తాను టిప్పుసుల్తాన్‌ను సమర్ధిస్తున్నానని .. తనను చంపే ధైర్యం మీకు ఉందా ? అని నళిన్‌కుమార్‌ను ప్రశ్నించారు ఒవైసీ . కర్ణాటకలో ఏ ప్రాంతానికైనా వచ్చి ఈ మాట చెబుతానని , దమ్ముంటే చంపాలని సవాల్‌ విసిరారు. ఆయన మాటలను ప్రధాని మోడీ , బీజేపీ హైకమాండ్‌ సమర్థిస్తుందా ? అని ఒవైసీ ప్రశ్నించారు. కర్ణాటకలో 30 పర్సంట్‌ సర్కార్‌ రాజ్యమేలుతోందని.. బీజేపీ నేతలకు దమ్ముంటే అవినీతిపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఇక గతంలోనూ పలుమార్లు ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఐనా ఆయన తీరు మార్చుకోవడం లేదంటూ మండిపడుతున్నారు కాంగ్రెస్‌ నేతలు. తాజాగా మరోసారి టిప్పు సుల్తాన్‌ను ఉద్దేశించి కటీల్‌ చేసిన కామెంట్స్‌పై విరుచుకుపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

సిద్ధరామయ్యపై కూడా..

నళిన్‌కుమార్‌ చేసిన వ్యాఖ్యలపై రగడ చల్లారక ముందే కర్నాటక మంత్రి అశ్వథనారాయణ ఆయనకు మద్దతు చేసిన వ్యాఖ్యలు మరింత కాకరేపాయి. టిప్పుసుల్తాన్‌ను యూరి గౌడ , నంజేగౌడ ఖతం చేశారని , అదేవిధంగా ప్రజలు టిప్పును అభిమానించే సిద్ధరామయ్యను తుదముట్టించాలని పిలుపునిచ్చారు అశ్వథనారాయణ. ఇక ఈ వ్యాఖ్యలకు ఘాటైన కౌంటర్‌ ఇచ్చారు సిద్దరామయ్య. ఇటువంటి వాళ్లను చాలామందని చూశానని, తనను చంపే ధైర్యం ఎవరికి ఉందని ప్రశ్నించారు. మంత్రి అశ్వథనారాయణను కేబినెట్‌ నుంచి డిస్మిస్‌ చేస్తారా ? లేదా ? అని ప్రశ్నించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
తల పైకెత్తి 5 నిమిషాలు ఆకాశం వైపు చూడండి,టెన్షన్ మొత్తం హుష్‌కాకి
తల పైకెత్తి 5 నిమిషాలు ఆకాశం వైపు చూడండి,టెన్షన్ మొత్తం హుష్‌కాకి
ఆండ్రాయిడ్ లేదా ఆపిల్.. రెండింటిలో ఏది సేప్టీ.. దేనివల్ల రిస్క్‌
ఆండ్రాయిడ్ లేదా ఆపిల్.. రెండింటిలో ఏది సేప్టీ.. దేనివల్ల రిస్క్‌
చూస్తే పిచ్చి మొక్క అనుకునేరు.. మీకు 100 ఏళ్లు ఆయుష్షునిచ్చే..
చూస్తే పిచ్చి మొక్క అనుకునేరు.. మీకు 100 ఏళ్లు ఆయుష్షునిచ్చే..
100 దాటినా యువకుడిలాగే ఉండాలా? సీక్రెట్ పిల్స్ వచ్చేస్తున్నాయ్
100 దాటినా యువకుడిలాగే ఉండాలా? సీక్రెట్ పిల్స్ వచ్చేస్తున్నాయ్
రోజుల తరబడి బాటిల్ కడగకుండా నీళ్లు తాగుతున్నారా?.. ఇదే జరిగేది
రోజుల తరబడి బాటిల్ కడగకుండా నీళ్లు తాగుతున్నారా?.. ఇదే జరిగేది
గరుడపురాణం చెప్పే సీక్రెట్స్.. ఇవి తెలిస్తే మీరే మహా మేథావి..!
గరుడపురాణం చెప్పే సీక్రెట్స్.. ఇవి తెలిస్తే మీరే మహా మేథావి..!
బ్రహ్మీ క్యారెక్టర్ రాసుకున్నాకే ఆ సినిమా కథలు రాశా.. కోన వెంకట్
బ్రహ్మీ క్యారెక్టర్ రాసుకున్నాకే ఆ సినిమా కథలు రాశా.. కోన వెంకట్
మహిళా దినోత్సవం వేళ తల్లికి అల్లు అర్జున్ ఖరీదైన కానుక.. వీడియో
మహిళా దినోత్సవం వేళ తల్లికి అల్లు అర్జున్ ఖరీదైన కానుక.. వీడియో
ఏసీ Vs కూలర్.. వేసవిలో ఆరోగ్యానికి ఏది మంచిది? ఇది తెలియకపోతే..
ఏసీ Vs కూలర్.. వేసవిలో ఆరోగ్యానికి ఏది మంచిది? ఇది తెలియకపోతే..
పిల్లలకు ఎగ్ ఫ్రైడ్ రైస్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
పిల్లలకు ఎగ్ ఫ్రైడ్ రైస్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం