ఆటో, టాక్సీ డ్రైవర్లకు 5 వేలు, రేషన్ కార్డు హోల్డర్లకు ఉచితంగా 2 నెలలపాటు రేషన్, సీఎం కేజ్రీవాల్

కోవిడ్ కేసులు పెరిగి పోయి ముఖ్యంగా పేద, బడుగు వర్గాలు పడరాని బాధలు పడుతుండడంతో వారిని ఆదుకునేందుకు ఢిల్లీలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ముందుకు వచ్చింది...

ఆటో, టాక్సీ డ్రైవర్లకు 5 వేలు, రేషన్ కార్డు హోల్డర్లకు ఉచితంగా 2 నెలలపాటు రేషన్, సీఎం కేజ్రీవాల్
Arvind Kejriwal
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: May 04, 2021 | 1:56 PM

కోవిడ్ కేసులు పెరిగి పోయి ముఖ్యంగా పేద, బడుగు వర్గాలు పడరాని బాధలు పడుతుండడంతో వారిని ఆదుకునేందుకు ఢిల్లీలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఆటో, టాక్సీ డ్రైవర్లకు 5 వేలరూపాయల ఆర్ధిక సహాయం ఇవ్వాలని నిర్ణయించింది. సాధ్యమైనంత త్వరగా ఈ సాయాన్ని అందజేస్తామని ఆయన మంగళవారం ప్రకటించారు. దీనివల్ల వారు కొంతవరకైనా తమ ఆర్ధిక నష్టాల నుంచి బయటపడతారని అన్నారు. అలాగే రేషన్ కార్డులు ఉన్నవారందరికీ రెండు నెలలపాటు ఉచితంగా రేషన్ అందజేస్తామన్నారు. నగరంలో 72 లక్షల మంది రేషన్ కార్డుహోల్డర్లు ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నగరంలో పరిస్థితి మెరుగు పడిన పక్షంలో లాక్ డౌన్ విధించాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. కోవిడ్ కారణంగా ఢిల్లీ ప్రభుత్వం గత ఏడాది కూడా 1.56 లక్షల మందిఆటో, టాక్సీ  డ్రైవర్లకు 5 వేలు, నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులకు 10 వేల ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది. ఢిల్లీలో ఈ నెల 10 వరకు లాక్ డౌన్ విధించిన  విషయం తెలిసిందే.

అటు-నిన్న ఒక్కరోజే నగరంలో 18 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 448 మంది రోగులు మరణించారు. వరుసగా చితులు కాలుతున్న దృశ్యాలను విదేశీ మీడియా కవర్ చేస్తోంది. ఇండియా ఎంతటి విషమ స్థితిలో చిక్కుకుందో ప్రపంచ దేశాలకు విదేశీ మీడియా వివరిస్తోంది. అటు-వరుసగా ఢిల్లీలో మూడో రోజైన సోమవారం కూడా మృతుల సంఖ్య 400 దాటిపోయింది. కాగా గత వారంతో పోలిస్తే సిటీలో ఈ వారం కేసులు స్వల్పంగా తగ్గడం విశేషం. పరిస్థితి ఇలాగే మెరుగుపడగలదని ప్రభుత్వం ఆశిస్తోంది. కోవిడ్ టెస్టుల సంఖ్య కూడా తగ్గింది. గత ఆదివారం 61,045 టెస్టులు నిర్వహించారు. అయితే పాజిటివిటీ రేటు 28.33 శాతం ఉందని, ఇది ఇంకా తగ్గాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏప్రిల్ 22 న ఇది 30 శాతాన్ని మించిపోయింది. మరోవైపు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది. కామన్ వెల్త్ గేమ్స్ విలేజీని కోవిడ్ సెంటర్ గా మార్చేసింది. అక్కడ ఆక్సిజన్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసింది. మరికొన్ని రోజుల్లో మరిన్ని కామన్ వెల్త్ గేమ్స్ విలేజీలను కూడా కోవిద్ సెంటర్లుగా మార్చాలన్న యోచన  ప్రభుత్వానికి ఉంది.

మరిన్ని చదవండి ఇక్కడ : ఓటీటీలో దుమ్మురేపుతున్న పవన్ కళ్యాణ్ వీడియో వకీల్ సాబ్ … :Vakeel Saab creates record OTT video. 

మూగజీవాలపై యాసిడ్ దాడి ..?ఏపీ లో మరో భయం! యాసిడ్ లంపి వైరస్ హడల్ వైరల్ వీడియో …

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..