Congress: కాంగ్రెస్‌కు మరో గట్టి షాక్‌.. కీలక పదవికి రాజీనామా చేసిన ఆనంద్ శర్మ..

| Edited By: Team Veegam

Aug 25, 2022 | 4:04 PM

Congress: కాంగ్రెస్‌కు మరో గట్టి షాక్‌ తగిలింది. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ పదవికి పార్టీ సీనియర్‌ నేత ఆనంద్‌శర్మ రాజీనామా చేశారు.

Congress: కాంగ్రెస్‌కు మరో గట్టి షాక్‌.. కీలక పదవికి రాజీనామా చేసిన ఆనంద్ శర్మ..
Anand Sharma
Follow us on

Congress: కాంగ్రెస్‌కు మరో గట్టి షాక్‌ తగిలింది. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ పదవికి పార్టీ సీనియర్‌ నేత ఆనంద్‌శర్మ రాజీనామా చేశారు. ఆత్మాభిమానాన్ని చంపుకోలేనని, ఆ పదవిలో కొనసాగలేనని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు. ఎన్నికల వేళ హిమాచల్‌లో కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు ముదిరాయి. సీఎం అభ్యర్ధిని పార్టీ ఇంకా ప్రకటించలేదు. కొద్దిరోజుల క్రితమే ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో పార్టీ నేతల మధ్య గొడవ మరింత ముదిరింది.

ఏప్రిల్‌ 26న హిమాచల్‌ప్రదేశ్‌ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా ఆనంద్‌శర్మను హైకమాండ్‌ నియమించింది. అయితే ఈ పదవి తనకు అవసరం లేదని, పార్టీ గెలుపు కోసం సామాన్య కార్యకర్తగా ప్రచారం చేస్తానని ట్వీట్‌ చేశారు ఆనంద్‌శర్మ. గులాంనబీఆజాద్‌తో పాటు జీ-23 గ్రూప్‌లో చాలా కీలకంగా ఉన్నారు ఆనంద్‌శర్మ. పార్టీ హైకమాండ్‌పై ఎప్పటికప్పుడు ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం సోనియాగాంధీకి పార్టీ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ కూడా గట్టి షాకిచ్చారు. ఆయనను జమ్మూకశ్మీర్‌లో పార్టీ ప్రచార కమిటీ సారథిగా నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకోగా.. ఆ బాధ్యత స్వీకరించేందుకు నిరాకరించారు. అలాగే.. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీకి సైతం రాజీనామా చేశారు. అయితే, కొన్నేళ్లుగా కాంగ్రెస్‌ నాయకత్వంపై అసంతృప్తి గళం వినిపిస్తున్న సీనియర్‌ నేతల జీ23 గ్రూప్‌లో ఆజాద్‌ ప్రముఖుడు. ఇటీవలే రాజ్యసభ పదవీకాలం ముగియగా పొడిగింపు దక్కలేదు. దీంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..