Paytm: పేటీఎం సీఈఓగా మరోమారు విజయ్ శేఖర్ శర్మ ఎంపిక
డిజిటల్ పేమెంట్స్‌లో సంచలనం సృష్టించిన పేటీఎంకు మరోమారు ఎండీ, సీఈఓగా విజయ్ శేఖర్ శర్మ నియామకమయ్యారు..
Vijay Shekhar Sharma re-appointed as Paytm MD: డిజిటల్ పేమెంట్స్‌లో సంచలనం సృష్టించిన పేటీఎంకు మరోమారు ఎండీ, సీఈఓగా విజయ్ శేఖర్ శర్మ నియామకమయ్యారు. దీంతో 2027 డిసెంబరు 18వ తేదీ వరకు అంటే మరో ఐదేళ్ల పాటు ఆయన పేటీఎం చీఫ్‌గా ఆపదవిలో కొనసాగనున్నారు. దాదాపు 99.67% మంది స్టేక్‌హోల్డర్లు విజయ్ శేఖర్ శర్మకు మద్దతుగా ఓటు వేయడంతో పేటీఎం తదుపరి ఎండీగా విజయ్ శేఖర్ శర్మను సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు నియమించారు. కాగా ఈ ఏడాది మే 2022లోనే దాదాపు వందశాతం స్టేక్‌హోల్డర్లు మద్దతుతో తదుపరి ఎండీగా కొనసాగేందుకు విజయ్ శేఖర్ శర్మకు మద్దతు తెలిపినట్లు పేటీఎం తెల్పింది. సంస్థను రానున్న రోజుల్లో లాభాల బాటలో నడిపించగలరనే నమ్మకంతో స్టేక్‌హోల్డర్లు విజయ్ శేఖర్ శర్మను మరోసారి సీఈఓగా ఎన్నుకున్నట్లు పేటీఎం సంస్థ ఏ ప్రకటనలో తెల్పింది.