Anna Hazaare: అస్వస్థతకు గురైన అన్నా హజారే.. ఆస్పత్రికి తరలింపు.. ఆరా తీసిన మహారాష్ట్ర సీఎం..
ముఖ సామాజిక సేవా కార్యకర్త అన్నా హజారే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో గురవారం ఆయనను పుణెలోని రూబీ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం హజారే ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని
ప్రముఖ సామాజిక సేవా కార్యకర్త అన్నా హజారే అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో గురవారం ఆయనను పుణెలోని రూబీ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం హజారే ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, అయినప్పటికీ వైద్యుల పరిశీలనలో ఉంచి చికిత్స అందజేస్తున్నామని రూబీ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అవధూత్ వెల్లడించారు. ‘ ఛాతీ నొప్పి, నీరసం కారణంగా హజారే ఆస్పత్రిలో చేరారు. ఆయనకు యాంజియోగ్రఫీ నిర్వహించాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. అదేవిధంగా కొద్దిపాటి విశ్రాంతి కూడా అవసరం ‘ అని అవధూత్ చెప్పుకొచ్చారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆరా.. కాగా హజారే ఆరోగ్య పరిస్థితిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఆరా తీశారు. కాగా ప్రస్తుతం ఉద్ధవ్ కూడా హెచ్ ఎన్ రిలయన్స్ ఆస్పత్రిలో ఫిజియోథెరపీ చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల ఆయన వెన్నెముకకు శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హజారే ఆస్పత్రిలో చేరిన విషయం తెలుసుకున్న ఉద్ధవ్ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.