అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకో: అమిత్‌షా సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్ర రాజకీయాలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని పార్టీలకు 18 రోజుల సమయం ఇచ్చామన్న అమిత్ షా.. ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవడంతోనే అక్కడ రాష్ట్రపతి పాలన విధించారని అన్నారు. ఈ విషయంలో ఆ రాష్ట్ర గవర్నర్‌ తీరును తప్పుపట్టాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. ఇక తగినంత సంఖ్యాబలం ఉంటే ఇప్పటికైనా ఎవరైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చంటూ ఆయన సూచించారు. కాగా గతంలో ఏ రాష్ట్రంలోనూ ప్రభుత్వాన్ని […]

  • Updated On - 8:48 pm, Wed, 13 November 19 Edited By:
అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకో: అమిత్‌షా సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్ర రాజకీయాలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని పార్టీలకు 18 రోజుల సమయం ఇచ్చామన్న అమిత్ షా.. ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవడంతోనే అక్కడ రాష్ట్రపతి పాలన విధించారని అన్నారు. ఈ విషయంలో ఆ రాష్ట్ర గవర్నర్‌ తీరును తప్పుపట్టాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. ఇక తగినంత సంఖ్యాబలం ఉంటే ఇప్పటికైనా ఎవరైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చంటూ ఆయన సూచించారు.

కాగా గతంలో ఏ రాష్ట్రంలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 18 రోజుల సమయం ఇచ్చిన దాఖలాలు లేవని ఆయన చెప్పుకొచ్చారు. గవర్నర్ ఏ ఒక్క పార్టీ హక్కును కాలరాయలేదని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని ఆయన ఏ పార్టీకి తిరస్కరించలేదని అమిత్ షా అన్నారు. తమ హక్కుకు భంగం కలిగిందంటూ కపిల్ సిబల్ లాంటి సీనియర్ లాయర్ ఆరోపణలు చిన్నపిల్లాడి వాదనల్లా ఉన్నాయని ఆయన విమర్శించారు.

ఇక బీజేపీ-శివసేన కూటమి గెలిస్తే దేవేంద్ర ఫడ్నవీస్‌ మహారాష్ట్ర సీఎం అవుతాడని.. తాను, మోదీ ప్రచారంలో చెప్పిన విషయాన్ని అమిత్‌ షా ఈ సందర్భంగా గుర్తుచేశారు. ‘‘అప్పుడు ఎవ్వరికీ అభ్యంతరాలు లేవు. కానీ ఇప్పుడు వారు మాకు నచ్చని కొత్త డిమాండ్లతో వచ్చారు’’ అని షా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.