AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాకు కాలుష్యం..మీకు ప్యూరిఫయర్లు..అదిరిందయ్యా మోదీ జీ !

ప్రధాని నరేంద్ర మోదీపై సోషల్ మీడియాలో పొగడ్తలెన్నుంటాయో… విమర్శలు అదే స్థాయిలో వుంటాయి. ఒక్కోసారి విమర్శల శాతమే ఎక్కువగా కనిపిస్తుంది. తాజాగా ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ వరస్ట్ స్టేజికి చేరుకున్న నేపథ్యంలో మోదీపై సెటెర్ల జోరెక్కువైంది సోషల్ మీడియాలో. అది కూడా ట్విట్టర్ వేదికగా మోదీని తెగ విమర్శించేస్తున్నారు నెటిజన్లు. ఇంతకీ ఎందుకంటారా ? రీడ్ దిస్ స్టోరీ.. ఢిల్లీ కాలుష్యం పెను ప్రమాద ఘంటికలు మోగిస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కోరోజు ప్రమాదస్థాయిని మించి పోతున్న కాలుష్యం […]

మాకు కాలుష్యం..మీకు ప్యూరిఫయర్లు..అదిరిందయ్యా మోదీ జీ !
Rajesh Sharma
| Edited By: |

Updated on: Nov 13, 2019 | 7:10 PM

Share

ప్రధాని నరేంద్ర మోదీపై సోషల్ మీడియాలో పొగడ్తలెన్నుంటాయో… విమర్శలు అదే స్థాయిలో వుంటాయి. ఒక్కోసారి విమర్శల శాతమే ఎక్కువగా కనిపిస్తుంది. తాజాగా ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ వరస్ట్ స్టేజికి చేరుకున్న నేపథ్యంలో మోదీపై సెటెర్ల జోరెక్కువైంది సోషల్ మీడియాలో. అది కూడా ట్విట్టర్ వేదికగా మోదీని తెగ విమర్శించేస్తున్నారు నెటిజన్లు. ఇంతకీ ఎందుకంటారా ? రీడ్ దిస్ స్టోరీ..

ఢిల్లీ కాలుష్యం పెను ప్రమాద ఘంటికలు మోగిస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కోరోజు ప్రమాదస్థాయిని మించి పోతున్న కాలుష్యం కారణంగా ఢిల్లీ జనం అల్లాడిపోతున్నారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు సరి, బేసి వంటి పెద్దగా ఉపయోగపడని నిబంధనలను ఢిల్లీ ప్రభుత్వం అమల్లోకి తెస్తూనే వుంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ కార్యాలయం కోసం ఎయిర్ ప్యూరిఫయర్లు కొనడం వివాదాస్పదమైంది. ఇందుకోసం ఏకంగా 36 లక్షల రూపాయలు వెచ్చించడంపై సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతోంది.

2018 మార్చిలో రాయిటర్స్ వెలువరించిన నివేదిక ఒకటి ఇటీవల వెలుగులోకి వచ్చింది. అందులో ప్రధాని మోదీ కార్యాలయంతోపాటు ఆరు కేంద్ర శాఖల కార్యాలయాల కోసం 36 లక్షల రూపాయలు వెచ్చించి ఎయిర్ ప్యూరిఫయర్లు కొనుగోలు చేసినట్లు పేర్కొనడంపై నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తూ పోస్టులు పెడుతున్నారు. దీనికి కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి హర్షవర్ధన్, మరో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ చేసిన కామెంట్లు మరింత ఆజ్యం పోశాయి.

ఢిల్లీలో గాలి కాలుష్యాన్ని అధిగమించేందుకు ప్రజలంతా క్యారెట్లు ఎక్కువగా తినాలంటూ హర్షవర్ధన్ చేసిన చౌకబారు సూచనపై నెటిజన్ల సెటైర్లు ఎక్కువయ్యాయి. మరోవైపు ప్రకాశ్ జవదేకర్ మరో అడుగు ముందుకేసి పొద్దున్నే సంగీతం వింటూ నిద్ర లేస్తే.. ఎలాంటి గాలి కాలుష్యం ఏమీ చేయదని ప్రకాశ్ కామెంట్ చేశారు. ఈ ఇద్దరి కామెంట్లకు ప్యూరిఫయర్ల ఖర్చను జోడిస్తూ సోషల్ మీడియాలో పోస్టులతో అదరగొడుతున్నారు నెటిజన్లు.

అయితే.. ప్రధాని నేరుగా ఢిల్లీ కాలుష్యంపై కామెంట్లేమీ చేయకపోవడం గమనార్హం. పైగా ఢిల్లీ కాలుష్యానికి కారణమవుతున్న పంజాబ్, హర్యానా, యుపి రైతుల పంటల కాల్చివేత చర్యలను తగ్గించేందుకు మోదీ చర్యలకు ఉపక్రమించారు. పంటలను కోయగా మిగిలిన పొలాలను కాల్చి వేసేందుకు తగిన పనిముట్లను, పరికరాలను తక్షణం మూడు రాష్ట్రాల రైతులకు సరఫరా చేయాలని ప్రధాని.. వ్యవసాయ మంత్రిత్వ శాఖను ఆదేశించారు. అయితే.. నెటిజన్లు మాత్రం మోదీనే టార్గెట్ చేస్తుండడం మరోవైపు విమర్శలకు దారి తీస్తోంది.