న్యాయవ్యవస్థలో జరిగేవన్నీ బహిరంగమేనా..? బిగ్ న్యూస్- బిగ్ డిబేట్

సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో సంచలన తీర్పులు చెబుతోంది రాజ్యాంగ ధర్మాసనం. మొన్ననే అయోధ్యపై తీర్పుతో శతాబ్దాల వివాదానికి తెరదించింది. ఇప్పుడు చీఫ్‌ జస్టిస్‌ ఆఫీస్‌నే ఆర్టీఐ పరిధిలోకి తెస్తూ మరో సంచలన తీర్పు చెప్పింది. న్యాయవ్యవస్థలో పదేళ్ల నుంచి నలుగుతున్న ఈ కేసులో ఇవాళ కీలక తీర్పు వెలువరించింది. న్యాయ వ్యవస్థలో వ్యక్తిగత గోప్యతా? పారదర్శకతా? అన్న ప్రశ్న నేపథ్యంలో పారదర్శకతకే పెద్దపీట వేసింది. అలాగని న్యాయమూర్తులపై నిఘా […]

న్యాయవ్యవస్థలో జరిగేవన్నీ బహిరంగమేనా..? బిగ్ న్యూస్- బిగ్ డిబేట్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 13, 2019 | 9:49 PM

సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో సంచలన తీర్పులు చెబుతోంది రాజ్యాంగ ధర్మాసనం. మొన్ననే అయోధ్యపై తీర్పుతో శతాబ్దాల వివాదానికి తెరదించింది. ఇప్పుడు చీఫ్‌ జస్టిస్‌ ఆఫీస్‌నే ఆర్టీఐ పరిధిలోకి తెస్తూ మరో సంచలన తీర్పు చెప్పింది. న్యాయవ్యవస్థలో పదేళ్ల నుంచి నలుగుతున్న ఈ కేసులో ఇవాళ కీలక తీర్పు వెలువరించింది. న్యాయ వ్యవస్థలో వ్యక్తిగత గోప్యతా? పారదర్శకతా? అన్న ప్రశ్న నేపథ్యంలో పారదర్శకతకే పెద్దపీట వేసింది. అలాగని న్యాయమూర్తులపై నిఘా పెట్టొద్దని కూడా వ్యాఖ్యానించింది. చీఫ్‌ జస్టిస్‌ గొగొయ్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తా, జస్టిస్‌ సంజీవ్‌ కన్నా ఈ తీర్పు రాస్తే… జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ చంద్రచూడ్‌ మరొక తీర్పు కాపీ రాశారు. ఇక ఈ తీర్పును స్వాగతిస్తూనే… కొలీజియం అంశంలో మరింత స్పష్టత రావాల్సి ఉందన్నారు పిటీషనర్‌ సుభాష్‌ చంద్ర అగర్వాల్‌. తాజా తీర్పుతో న్యాయవ్యవస్థకు వచ్చిన నష్టమేంటి? ఇప్పుడేం జరగబోతోంది? ఆర్టీఐ పరిధిలోకి చీఫ్‌ జస్టిస్‌ ఆఫీస్‌ వచ్చిన నేపథ్యంలో రాజకీయ పార్టీల సంగతేంటి..? అన్న దానిపై బిగ్ న్యూస్- బిగ్ డిబేట్ వేదికగా టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ ఆధ్వర్యంలో కీలక చర్చ జరిగింది. దీనిపై రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ చంద్రకుమార్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ మాడబూటి శ్రీధర్, ఏపీ మాజీ కమిషనర్ విజయబాబు, కాంగ్రెస్ ప్రతినిధి, అడ్వకేట్ సుందర్ రామ్ శర్మ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సంచలన తీర్పుపై వీరందరి అభిప్రాయం ఏంటి..? అన్నది దిగువ వీడియోలో చూడండి.