Ambulance Driver: బరాత్‏లో పీపీఈ కిట్‏తో డ్యాన్స్ చేసిన అంబులెన్స్ డ్రైవర్.. వీడియో వైరల్..

Viral Video: ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవే వేగంగా వ్యాప్తి చెందుతుంది. రోజుకీ కరోనా కేసులు గణనీయంగా నమోదవుతున్నాయి.

Ambulance Driver: బరాత్‏లో పీపీఈ కిట్‏తో డ్యాన్స్ చేసిన అంబులెన్స్ డ్రైవర్.. వీడియో వైరల్..
Ambulance Driver
Follow us

|

Updated on: Apr 28, 2021 | 8:49 AM

Viral Video: ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. రోజుకీ కరోనా కేసులు గణనీయంగా నమోదవుతున్నాయి. దీంతో వైద్య సిబ్బంది విరామం లేకుండా.. రోగులకు కాపాడాటానికి నిత్యం శ్రమిస్తూనే ఉన్నారు. ఇక అంబులెన్స్ డ్రైవర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. రోజూకీ క్షణమైన విశ్రాంతి లేకుండా.. కరోనా రోగులు, శవాలను తరలించేందుకు వారంతా పీపీఈ కిట్లను ధరించి సేవల్లో మునిగిపోయారు. కరోనా రోగులను కాపాడటంలో పోరాడుతూ.. తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అయితే తాజాగా ఓ అంబులెన్స్‌ డ్రైవర్‌ చేసిన పని వారు ఎంత కష్టపడుతున్నారో అర్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ప్రస్తుతం వైద్య సిబ్బంది పడుతున్న మానసిక ఒత్తిడికి అద్దం పడుతుంది. వారి దయనీయ స్థితి నెటిజన్లను ఆవేదనకు గురి చేస్తోంది.

ఉత్తరాఖండ్‏లోని హాల్ద్వానీ పట్టణంలో ఓ కాలేజీ వద్ద అతి తక్కువ మందితోనే పెళ్లి బరాత్ జరుగుతోంది. అయితే అటు నుంచి వెళ్తున్న అంబులెన్స్ డ్రైవర్ మహేష్ వాహనాన్ని పక్కనే ఆపాడు. క్షణం కూడా ఆలోచించకుండా.. తాను ధరించిన పీపీఈ కిట్లోనే వచ్చి ఆ బరాత్‏లో డ్యాన్స్ చేశాడు. మ్యూజిక్‌ అనుగుణంగా స్టెప్పులేస్తూ తన పని ఒత్తిడిని మరిచేలా అలసిపోయేలా డ్యాన్స్‌ చేశాడు. అయితే అకస్మాత్తుగా ప్రత్యక్షమైన పీపీఈ కిట్‌ డ్రైవర్‌ను చూసి పెళ్లివారు ఆందోళన చెందారు. అనంతరం ఆ డ్రైవర్‌ ఆనందంతో డ్యాన్స్‌ చేస్తుండడంతో అతడిని వారించకుండా డ్యాన్స్ చేయనిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక ఇదే విషయం పై అంబులెన్స్ డ్రైవర్ మహేష్ మాట్లాడుతూ.. నేను దాదాపు 10 నిమిషాల పాటు డ్యాన్స్ చేశాను. నాకు చాలా సంతోషంగా అనిపించింది. అలాగే నా ఒత్తిడిని మర్చిపోయాను. అందుకే డ్యాన్స్ చేయాలనిపించింది అంటూ చెప్పాడు.

హల్ద్వానీలోని డాక్టర్ సుశీలా తివారీ ప్రభుత్వ ఆసుపత్రిలో మహేష్ అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ సందర్బంగా.. ఆసుపత్రిలో పనిచేస్తున్న మనస్తత్వవేత్త యువరాజ్ పంత్ మాట్లాడుతూ.. నిత్యం కరోనాతో మరణించిన వారి మృతదేహాలను అంబులెన్స్ డ్రైవర్ ఎంతో కష్టపడుతున్నాడు. నిత్యం కరోనాతో మరణించేవారిని చూడడం వలన తను చాలా ఒత్తిడికి గురవుతున్నాడు. ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి ‘షేకింగ్ థెరపీ’ ఉంది. ఒత్తిడి హార్మోన్ విడుదలైనప్పుడు, అది రక్తంలో కనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో డ్యాన్స్, క్రీడలు, యోగా చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు అని పంత్ తెలిపారు.

ట్వీట్..

Also Read: ప్రీమియం కట్టడం ఒక్కసారి మాత్రమే..! బ్యాంకు వడ్డీ కంటే డబుల్ ప్రాఫిట్..? ఎల్ఐసీ సూపర్ పాలసీ..

రెండు వేల నోటు ముద్రించడానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా? ఒక్కో నోటుకు ఒక్కో ఖర్చు ఉంటుందని తెలుసుకోండి!

జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు