ఝార్ఖండ్ లో ఆ రాత్రి కనిపించిన అపర ‘ఏలియన్’ అసలు కథ ఇది ! ఓస్ ! ఇంతేనా …?
ఝార్ఖండ్ లోని హజారీబాగ్ ప్రాంతంలో ఇటీవల ఓ రోజు రాత్రి నిర్మానుష్యమైన రోడ్డుపై నడిచివెళ్తున్న ఆకారం తాలూకు 30 సెకండ్ల క్లిప్ ఇంటర్నెట్ ను కుదిపివేసింది.
ఝార్ఖండ్ లోని హజారీబాగ్ ప్రాంతంలో ఇటీవల ఓ రోజు రాత్రి నిర్మానుష్యమైన రోడ్డుపై నడిచివెళ్తున్న ఆకారం తాలూకు 30 సెకండ్ల క్లిప్ ఇంటర్నెట్ ను కుదిపివేసింది. అది ఎలియానా లేక దెయ్యమా అని చాలామంది అయోమయంలో పడిపోయారు. లోకల్ ఛానల్ జనదూత్ ప్రతినిధి ఒకరు ఈ వింతను వాట్సాప్ ద్వారా సర్క్యులేట్ చేసిన ఇద్దరు వ్యక్తులను దీనిపై ఆరా తీశారు. తాము ఓ మిత్రుడి తల్లి అంత్యక్రియలకు హాజరై చక్రధర్ పూర్ నుంచి సెరికేల ప్రాంతానికి వస్తుండగా ఈ ఆకారాన్ని చూశామని వారు చెప్పారు. అసలు విషయం ఏమిటంటే ఇంతకీ ఆ ఏలియన్ లా కనిపించిన వ్యక్తి మహిళ అని, నగ్నంగా నడిచి వెళ్తోందని నిర్ధారించుకున్నామని వారు చెప్పారు. తమకన్నా ముందు బైక్ లపై కొందరు వెళ్లారని, వారెవరూ ఆ మహిళను పట్టించుకోలేదని, అయినా ఆ తరువాత వారిని కలిసి అడగగా అది ఓ మంత్రగత్తె అని చెప్పారని వెల్లడించారు. అయితే ఆ మహిళ మంత్రగత్తె కాదన్నారు. కానీ నగ్నంగా ఎందుకు వెళ్తోందో తెలియలేదన్నారు. గత ఏప్రిల్ 27 నాటి ఈ వీడియో ఇటీవలే బయటకు వచ్చింది. ఏమైనా ఈ వీడియో చూసి అది ఏలియన్ అని ఒకరంటే మరొకరు దెయ్యమని అన్నారు=. తాము భయపడినట్టు కొందరు నెటిజెన్లు పేర్కొనగా ఇంకొందరు దీన్ని తేలికగా కొట్టి పారేశారు. ప్రజలను, ముఖ్యంగా అమాయకులను భయపెట్టడానికి కొందరు ఇలాంటి ట్రిక్కులు చేస్తుంటారని వారు అన్నారు.
అటు- ఈ ఉదంతంపై తాము ఇన్వెస్టిగేట్ చేస్తామని సెరికేల సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ నౌషాద్ తెలిపారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Rani Padmini: హిస్టరీలో మిస్టరీగా మిగిలిన కోట.. 700 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కోటలో.. ఇప్పటికీ రాణి పద్మావతి గజ్జెల చప్పుళ్లు