కారులో రెండు ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి.. కేంద్రం కీలక నిర్ణయం.. ఏప్రిల్ 1 నుంచి అమలు.!
Two Airbags Mandatory: కారులో షికారుకెళ్లడం ప్రతీ ఒక్కరికి సరదానే… కొద్ది మంది అవసరానికి కారును వినియోగిస్తుంటే… మరికొద్ది మంది విలాసానికి..
Two Airbags Mandatory: కారులో షికారుకెళ్లడం ప్రతీ ఒక్కరికి సరదానే… కొద్ది మంది అవసరానికి కారును వినియోగిస్తుంటే… మరికొద్ది మంది విలాసానికి వినియోగిస్తుంటారు. అయితే కారు ప్రయాణాన్ని మరింత సేఫ్‌గా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాన్ని అమలులోకి తీసుకురానుంది. ఇకపై ముందు వరుస సీట్లకు ఎయిర్ బ్యాగ్స్‌ను తప్పనిసరి చేయనుంది.
ఇప్పటికే ఈ అంశంపై కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు పంపించగా.. వాటిని న్యాయ మంత్రిత్వ శాఖ అంగీకరించడంతో పాటు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. దీనితో ఇక నుంచి డ్రైవర్‌తో పాటు పక్కసీటులో ఉండే ప్రయాణికుడి వైపు కూడా ఎయిర్‌బ్యాగ్స్ తప్పనిసరి కానున్నాయి. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త రూల్ అమలులోకి రానుంది. దీనిపై అధికారికంగా నోటిఫికేషన్ మరో మూడు రోజుల్లో వెలువడనున్నట్లు సమాచారం. కాగా, భారత్ దేశంలో ప్రయాణికుల భద్రతా విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడబోమని, రాష్ట్రాలు రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఇటీవల కేంద్రం రాష్ట్రాలను ఆదేశించిన సంగతి తెలిసిందే.
రెండు ఎయిర్ బ్యాగ్స్….
కార్లలో రెండు ఎయిర్ బ్యాగ్స్ నిబంధనలు అమల్లోకి తీసుకురావాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా కార్లలో ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి చేయనుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం నాలుగు చక్రాల వాహనాలకు డ్రైవర్ వైపు ఎయిర్‌బ్యాగ్ తప్పనిసరి. దీంతో ప్రమాద సమయంలో డ్రైవర్ తప్పించుకొన్నా.. సహ ప్రయాణికుడి ప్రాణాలు ప్రమాదంలో పడతాడు. ఈ నేపథ్యంలోనే కేంద్రం రెండు ఎయిర్ బ్యాగ్స్ నిబంధనను తీసుకురానుంది.
Also Read:
ఈ పది సెకండ్స్ వీడియో ఏకంగా రూ. 48 కోట్లకు అమ్ముడైంది.. ఎందుకు అంత ధర పలికిందో తెలుసా.!
1972 తర్వాత అదే మొదటిసారి.. క్రికెట్ చరిత్రలో బ్లాక్ డే.. ఆటగాళ్లపై ఉగ్రవాదులు దాడి..!
మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గుతోన్న బంగారం ధరలు.. 2 నెలల్లో ఎంత తగ్గిందంటే.!
Viral: భర్తను కోల్పోయిన టీచర్‌కు స్టూడెంట్ ఓదార్పు లేఖ.. నెట్టింట వైరల్‌గా మారిన పోస్ట్.!