ఆశ్చర్యం.! విమాన ప్రమాదంపై 6 నెలల ముందే ట్వీట్.. నెట్టింట వైరల్..
అహ్మదాబాద్ విమాన ప్రమాద దృశ్యాలు అందరి హృదయాలను కలచివేస్తున్నాయి. అయితే ఈ ప్రమాదాన్ని 'ఆస్ట్రో షర్మిష్టా' అనే యువతి డిసెంబర్ 29, 2024లోనే ట్వీట్ చేశారు. '2025లో ఏవియేషన్ వృద్ది అద్భుతంగా ఉంటుంది. కాకపోతే సేఫ్టీ, సెక్యురిటీ పరంగా ఇబ్బందులు ఉంటాయి.

అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి 242 మందితో లండన్‌లోని గాట్విక్ ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరింది ఎయిరిండియా విమానం. మధ్యాహ్నం 1.17 నిమిషాలకు టేకాఫ్ తీసుకుని 2 నిమిషాల్లోనే మేఘానిలోని గుజ్‌సెల్ విమానాశ్రయ సమీపంలో కుప్పకూలింది. భారీ పేలుడు కారణంగా దట్టమైన పొగలు వ్యాపించాయి. గురువారం మధ్యాహ్నం సంభవించిన ఈ ఘోర విమాన దృశ్యాలు అందరి హృదయాలను కలచివేస్తున్నాయి. అయితే ఈ విమాన ప్రమాదంపై ఓ మహిళ ఆరు నెలల ముందే ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఆ ట్వీట్ వైరల్ అవుతోంది.
ఈ ప్రమాదాన్ని ‘ఆస్ట్రో షర్మిష్టా’ అనే మహిళ డిసెంబర్ 29, 2024లోనే ట్వీట్ చేసింది. ‘2025లో ఏవియేషన్ వృద్ది అద్భుతంగా ఉంటుంది. కాకపోతే సేఫ్టీ, సెక్యురిటీ పరంగా ఇబ్బందులు ఉంటాయి. అలాగే, విమానం కూలింది అనే బ్రేకింగ్ వార్తలు మనల్ని కలిచి వేస్తాయి’. అని ఆ మహిళ 6 నెలలకు ముందే అంచనా వేసి చెప్పింది. అలాగే జూన్ 5, 2025న కూడా ఇదే ట్వీట్‌ను రీ-ట్వీట్ చేస్తూ.. ‘ఓ విమాన ప్రమాదం జరుగుతుందని.. అది విమానయాన సంస్థను 2025లో నాశనం చేస్తుందని గట్టిగా అంచనా వేస్తున్నట్టు మళ్లీ చెప్పుకొచ్చింది’. ప్రస్తుతం ఆ మహిళ ట్వీట్లు వైరలవుతున్నాయి.
Tata will make Rafale fuselage in Hyderabad. This is just aviation expansion, ISRO will surprise the world in Space and satellite engineering, space tourism in coming two years. Predicted this last year via Nakshatra transit. I am still holding high the prediction of Plane crash… https://t.co/WjX39R7E47
— Astro Sharmistha (@AstroSharmistha) June 5, 2025




