విమాన ప్రమాదంలో మృత్యుంజయుడు..! 11A సీట్ ప్రయాణికుడు రమేష్ ఒక్కడే బతికాడు..!
అహ్మదాబాద్‌లోని ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో అందరూ మరణించారని ప్రకటించిన తరువాత, ఒక వ్యక్తి ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడ్డాడు. 38 ఏళ్ల రమేష్ అనే వ్యక్తి విమానం కూలిపోయిన తర్వాత శిథిలాల నుండి బయటకు వచ్చాడు. అతను గాయాలతో ఆసుపత్రిలో చేరాడు.

అహ్మాదాబాద్‌లో ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న అందరూ మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. కానీ, ఒక్క వ్యక్తి మాత్రం ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటినట్లు సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. విమానంలోని 11ఏ సీటులో కూర్చున్న ప్రయాణికుడు 38 ఏళ్ల విశ్వస్ కుమార్ రమేష్ ప్రమాదం జరిగిన తర్వాత సురక్షితంగా ప్రాణాలతో బయటపడి.. శిథిలాల నుంచి బయటికి నడుచుకుంటూ వస్తున్న వీడియో కూడా ప్రస్తుతం వైరల్ అవుతోంది. రమేష్ బ్రిటీష్ పౌరుడు.
ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న వారి బంధువులు అహ్మదాబాద్‌లోని అసర్వ సివిల్ హాస్పిటల్‌లో తమ వారి కోసం తీవ్రంగా వెతుకుతుండగా, జనరల్ వార్డులోని మంచంపై రమేష్ పడి ఉన్నాడు. అతను ఘోరమైన ప్రమాదం నుండి బయటపడ్డానని చెప్పాడు. “టేకాఫ్ అయిన ముప్పై సెకన్ల తర్వాత, పెద్ద శబ్దం వచ్చింది. తరువాత విమానం కూలిపోయింది. ఇదంతా చాలా త్వరగా జరిగింది,” అని ఛాతీ, కళ్ళు, పాదాలపై గాయాలు అయ్యాయి. అంత పెద్ద ప్రమాదం జరిగితే రమేష్ ఒక్కడే ఎలా బయటపడ్డాడనే విషయంపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
Ramesh vishwakumar survives the Air India plane crash…pic.twitter.com/aH7jt0v0Aw
— Volcaholic 🌋 (@volcaholic1) June 12, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




