WITT Summit 2024: రైతులకు మద్ధతుగా వెళ్లకపోవడానికి అదే కారణం… టీవీ9 సమ్మిట్‌లో అసదుద్దీన్
ఆలయాన్ని కూల్చివేసి బాబ్రీ మసీదు నిర్మించారని సుప్రీంకోర్టు చెప్పలేదన్నారు. ఆలయాన్ని కూల్చివేసి మసీదు నిర్మించారని బీజేపీ ఎప్పుడూ చెబుతుండగా, దానిని సుప్రీంకోర్టు పూర్తిగా తోసిపుచ్చిందన్నారు. 'బీజేపీకి రామమందిరం ఎప్పుడు గుర్తుకొచ్చిందో చెప్పగలరా? పాలన్‌పూర్ తీర్మానాన్ని 1989లో ఆమోదించారు, కానీ అంతకు ముందు అది ఆమోదం...
దేశంలోనే అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్ టీవీ9 నిర్వహిస్తున్న వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్‌లో పాల్గొన్న ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను నాథూరామ్‌ను వ్యతిరేకిస్తున్నానని, అయితే బాబ్రీ మసీద్ జిందాబాద్ జిందాబాద్ అనడంలో తప్పులేదన్నారు. బాబ్రీ మసీద్ అంశంపై మాట్లాడిన అసదుద్దీన్.. విశ్వాసం ప్రాతిపదికగా ఈ నిర్ణయం తీసుకుంటున్నామని, ఈరోజు ఇదే అతిపెద్ద సమస్యగా మారిందని, రేపు కూడా అదే విధంగా మారుతుందని సుప్రీంకోర్టు చెప్పిందని ఒవైసీ అన్నారు.
విశ్వాసాన్ని ఒక అంశంగా చేస్తే సాక్ష్యాలు ఏమవుతాయని ఆయన అన్నారు. ఒకవేళ కోర్టు విశ్వాసంపై నిర్ణయం తీసుకుంటే, నా విశ్వాసం కంటే మీ విశ్వాసం ఎలా పెద్దది అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఈ నిర్ణయం తర్వాత, రామ మందిరంపై నిర్ణయం తీసుకున్న తర్వాత, ఇంకా చాలా సమస్యలు లేవనెత్తుతారని నేను భయపడుతున్నానని అసదుద్దీన్ అభిప్రాయపడ్డారు. తాను నాథూరామ్‌కి వ్యతిరేకిని, అయితే బాబ్రీ మసీదు జిందాబాద్ అనడంలో తప్పులేదని ఒవైసీ అన్నారు.
ఆలయాన్ని కూల్చివేసి బాబ్రీ మసీదు నిర్మించారని సుప్రీంకోర్టు చెప్పలేదన్నారు. ఆలయాన్ని కూల్చివేసి మసీదు నిర్మించారని బీజేపీ ఎప్పుడూ చెబుతుండగా, దానిని సుప్రీంకోర్టు పూర్తిగా తోసిపుచ్చిందన్నారు. ‘బీజేపీకి రామమందిరం ఎప్పుడు గుర్తుకొచ్చిందో చెప్పగలరా? పాలన్‌పూర్ తీర్మానాన్ని 1989లో ఆమోదించారు, కానీ అంతకు ముందు అది ఆమోదం పొందలేదు. ఆలయాన్ని కూల్చి మసీదు కట్టించారని పలనూర్ తర్వాతే చెప్పడం మొదలైందన్నారు. రామ మందిరానికి సంబంధించి 1880లో న్యాయ పోరాటం జరుగుతోందని ఒవైసీ అన్నారు. మసీదు ముందు చబుర్తా ఉంది. మసీదుకు సంబంధించి ఎప్పుడూ వివాదం లేదు. అక్కడ ఆలయంపై మసీదు నిర్మించలేదు. రామమందిర నిర్ణయంపై అనేక సమస్యలు తలెత్తాయి. ఇంకా బాబ్రీ కూల్చివేతలో నిందితులకు శిక్ష పడలేదని అన్నారు.
हिंदुओं की नैतिक व्यवस्था हम पर क्यों लागू की जा रही है : @asadowaisi#TV9WhatIndiaThinksToday | #News9GlobalSummit | #TV9BharatvarshSattaSammelan | #WITT2024 | @kartikeya_1975 pic.twitter.com/IAPu714iaI
— TV9 Bharatvarsh (@TV9Bharatvarsh) February 27, 2024
ఇక ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేపడుతోన్న రైతుల గురించి గురించి మాట్లాడిన ఓవైసీ.. తాము రైతుల ఉద్యమానికి అండగా ఉన్నామన్నారు. రైతు ఉద్యమం రాజకీయేతర ఉద్యమన్న ఆయన తమ నిరసన రాజకీయేతర ఉద్యమమని రైతులు ముందే చెప్పారన్నారు. అందుకే వారికి మద్దతుగా తాము అక్కడికి వెళ్లలేదన్నారు. అక్కడికి వెళ్లి వాతావరణాన్ని చెడగొట్టడం తమకు ఇష్టం లేదని తేల్చి చెప్పారు. ఇక ఎన్నికలకు ముందు అనేక పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. చాలా పార్టీలతో చర్చలు జరుపుతున్నామని. దీని గురించి ఇప్పుడే ఎలాంటి విషయాలు వెల్లడించలేమన్నారు. తాము బీజేపీకి బీ పార్టీ అని విమర్శలు చేస్తారని. ఇందులో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..