AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనోభావాలను దెబ్బతీయడం నా ఉద్దేశం కాదు.. వివాదాస్పద వ్యాఖ్యల పై ఖర్గే క్షమాపణలు

గుజరాత్ ప్రజల గురించి తాను చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే క్షమాపణలు చెప్పారు. "గుజరాత్ ప్రజల పట్ల నాకు ఎప్పుడూ అత్యంత గౌరవం ఉంది, ఎప్పటికీ ఉంటుంది. వారి మనోభావాలను దెబ్బతీయడం నా ఉద్దేశం కాదు" అని అన్నారు. ఆదివారం (ఏప్రిల్ 05) కేరళలోని ఇడుక్కి జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఖర్గే వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

మనోభావాలను దెబ్బతీయడం నా ఉద్దేశం కాదు.. వివాదాస్పద వ్యాఖ్యల పై ఖర్గే క్షమాపణలు
Aicc President Mallikarjun Kharge
Balaraju Goud
|

Updated on: Apr 08, 2026 | 4:08 PM

Share

గుజరాత్ ప్రజల గురించి తాను చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే క్షమాపణలు చెప్పారు. “గుజరాత్ ప్రజల పట్ల నాకు ఎప్పుడూ అత్యంత గౌరవం ఉంది, ఎప్పటికీ ఉంటుంది. వారి మనోభావాలను దెబ్బతీయడం నా ఉద్దేశం కాదు” అని అన్నారు. ఆదివారం (ఏప్రిల్ 05) కేరళలోని ఇడుక్కి జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఖర్గే మాట్లాడుతూ, గుజరాత్‌లోని నిరక్షరాస్యుల వలె కాకుండా, రాష్ట్ర ప్రజలు విద్యావంతులు, తెలివైనవారని, వారిని తప్పుదోవ పట్టించలేరని అన్నారు. ఆయన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. దీంతో మల్లిఖార్జున ఖర్గే వివరణ ఇచ్చుకున్నారు. గుజరాత్ ప్రజలకు క్షమాపణలు చెప్పారు.

బీజేపీ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, ఖర్గే ప్రకటనతో రాహుల్ గాంధీ ఏకీభవిస్తున్నారా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి కించిత్ ఇంగితజ్ఞానం ఉంటే, ఆయన ఆ వ్యాఖ్య నుండి తనను తాను దూరం చేసుకోవాలి, దానిని ఖండించాలి, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మల్లిఖార్జున ఖర్గే నేడు నిర్వహిస్తున్న పదవిని గతంలో జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, మౌలానా ఆజాద్, సోనియా గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, చివరికి రాహుల్ గాంధీ వంటి నాయకులు కూడా నిర్వహించారని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఇంతటి ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి ఎలాంటి భాషను ఉపయోగిస్తున్నారు? ఖర్గే వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయంటూ ఖండించారు.

వివాదం ముదిరిపోతుండటాన్ని చూసి, మల్లిఖార్జున ఖర్గే బుధవారం (ఏప్రిల్ 08) క్షమాపణ చెప్పారు. “కేరళలో ఇటీవల చేసిన ఎన్నికల ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తున్నారు. అయినప్పటికీ, నేను బాధ్యతాయుతంగా విచారం వ్యక్తం చేస్తున్నాను. గుజరాత్ ప్రజల పట్ల నాకు ఎల్లప్పుడూ అత్యంత గౌరవం ఉంది, ఎప్పటికీ ఉంటుంది. వారి మనోభావాలను దెబ్బతీయడం నా ఉద్దేశం ఎప్పుడూ కాదు.” అంటూ వారికి క్షమాపణలు చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us