Big Breaking: ఎన్డీయేకు బిగ్ షాక్ ఇచ్చిన అన్నాడీఎంకే.. సంచలన ప్రకటన విడుదల..!
NDA vs AIADMK: తమిళనాట ఎలాగైనా జెండా పాతాలని భావిస్తున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి బిగ్ షాక్ ఇచ్చింది ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం పార్టీ. అదేనండీ అన్నా డీఎంకే పార్టీ. ఇప్పటి వరకు దోస్త్ మేరా దోస్త్ అంటూ తిరిగిన ఈ రెండు పార్టీల నేతలు.. ఇక నుంచి ఎవరికెవరు ఏమవుతారు? అని ముందుకు సాగాల్సి వచ్చింది. అయితే, ఈ దఫా లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణాదిన మంచి పట్టు సాధించి..

NDA vs AIADMK: తమిళనాట ఎలాగైనా జెండా పాతాలని భావిస్తున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి బిగ్ షాక్ ఇచ్చింది ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం పార్టీ. అదేనండీ అన్నా డీఎంకే పార్టీ. ఇప్పటి వరకు దోస్త్ మేరా దోస్త్ అంటూ తిరిగిన ఈ రెండు పార్టీల నేతలు.. ఇక నుంచి ఎవరికెవరు ఏమవుతారు? అని ముందుకు సాగాల్సి వచ్చింది. అయితే, ఈ దఫా లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణాదిన మంచి పట్టు సాధించి.. తద్వారా అసెంబ్లీ స్థానాలను సైతం కైవసం చేసుకోవాలని భావించిన బీజేపీకి.. అన్నాడీఎంకే సైలెంట్‌గా ఝలక్ ఇచ్చింది. అన్నాడీఎంకే ఇచ్చిన స్ట్రోక్‌తో తమిళనాడు బీజేపీ పరిస్థితి ఏంటా? పాటిలిక్స్‌లో హాట్ డిస్కర్షన్స్ నడుస్తున్నాయి.
సార్వత్రిక ఎన్నికలకు కొద్ది నెలల ముందు తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే.. బీజేపీ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే(National Democratic Alliance)తో బంధాన్ని తెంచుకుంది. చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లాల నేతల సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేయగా.. అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేపీ మునుసామి అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ ప్రకటన రావడమే ఆలస్యం.. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు పటాకులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఎప్పటి నుంచో కోరుకుంటున్న అంశం ఇప్పుడు అయిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు.
ఇటీవలి కాలంలో బీజేపీ, అన్నాడీఎంకే మధ్య సంబంధాలు బాగా చెడిపోయాయి. ఇటీవల దివంగత మాజీ ముఖ్యమంత్రి సీఎన్ అన్నాదురైపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు చేసిన కాంట్రవర్సీ కామెంట్స్.. ఈ గ్యాప్‌ని మరింత పెంచాయి. దాంతో చివరి ప్రయత్నంగా అన్నాడీఎంకే నేతలు ఢిల్లీ పెద్దలను కలిశారు. తమ డిమాండ్స్‌ని వారికి బలంగానే వినిపించారు. అన్నాదురైపై చేసిన వ్యాఖ్యలకు అన్నామలై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ శారు. లేదంటే.. అతని స్థానంలో వివాదరహిత వ్యక్తిని నాయకుడిగా నియమించాలని డిమాండ్ చేశారు. అయితే, బీజేపీ అధిష్టానం నుంచి ఎలాంటి రెస్పాండ్స్ రాకపోవడంతో.. ఇక లాభం లేదనుకుని ఫైనల్ డెసిషన్ తీసుకున్నారు నేతలు. అన్నాదురై.. అన్నాడీఎంకే వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి ఎంజీ రామచందన్‌కు గురువు. కారణంగా తమ ఆరాధ్య వ్యక్తిపై అన్నామలై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమిళనాడులో పార్టీని పునరుజ్జీవింపజేసేందుకు అన్నామలై తనదైన శైలిలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో సనాతన ధర్మ వివాదంతో అన్నాదురైని ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ అన్నాడీఎంకేలో ఆగ్రహం తెప్పించింది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నామలై తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి దివంగత నేతలను సైతం వదలకుండా.. సంస్కారహీనంగా కామెంట్స్ చేస్తున్నారని నిప్పులుచెరుగుతున్నారు.
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై గతంలో కూడా దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితపై తీవ్రమైన విమర్శలు చేశారు. జయలలిత పాలనా కాలంలో తమిళనాట విపరీతమైన అవినీతి జరిగిందని, అందుకే వారు జైలు శిక్ష కూడా అనుభవించారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు అన్నామలై. ఈ వ్యాఖ్యలపై అన్నాడీఎంకే శ్రేణులు ఫైర్ అయ్యారు. కనీస అవగాహన లేకుండా.. తనను తాను హైప్ చేసుకోవడం కోసం ఉన్నత వ్యక్తులు టార్గెట్‌గా బాధ్యతారహితమైన కామెంట్స్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు అన్నాడీఎంకే నేతలు. అంతేకాదు, ఇటీవలి కాలంలో అన్నాడీఎంకే నేతలే టార్గెట్‌గా బీజేపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. తమ పార్టీ నేతలపై కావాలాని ఐటీ, ఈడీ రైడ్స్ చేయిస్తున్నారంటూ కన్నెర్రజేశారు. వీటిన్ని పర్యావసానంగా ఇవాళ బీజేపీతో దోస్తీ కట్ చేస్తున్నామంటూ అన్నాడీఎంకే నేతలు ప్రకటించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
