AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళనాడులో అప్పుడే సీఎం స్టాలిన్ ప్రభుత్వంపై అన్నా డీఎంకే నిరసన సెగలు, మూడున్నర వేలమందిపై ‘కోవిడ్’ కేసులు

తమిళనాడులో అప్పుడే సీఎం స్టాలిన్ ప్రభుత్వంపై అన్నాడీఎంకే నిరసన సెగలు ప్రారంభమయ్యాయి. మాజీ సీఎం దివంగత జయలలిత స్మృతి చిహ్నంగా జయలలిత యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వం తీసుకున్న

తమిళనాడులో అప్పుడే సీఎం స్టాలిన్ ప్రభుత్వంపై అన్నా డీఎంకే  నిరసన సెగలు, మూడున్నర వేలమందిపై 'కోవిడ్' కేసులు
Aiadmk Leaders.booked For Flouting Covid Rules In Tamilnadu
Umakanth Rao
| Edited By: |

Updated on: Jul 28, 2021 | 9:56 AM

Share

తమిళనాడులో అప్పుడే సీఎం స్టాలిన్ ప్రభుత్వంపై అన్నాడీఎంకే నిరసన సెగలు ప్రారంభమయ్యాయి. మాజీ సీఎం దివంగత జయలలిత స్మృతి చిహ్నంగా జయలలిత యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయరాదని స్టాలిన్ సర్కార్ చేసిన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ నిన్న విల్లుపురంలో మాజీ మంత్రి షణ్ముగం ఆధ్వర్యాన వేలమంది ప్రజలు, అన్నాడీఎంకే కార్యకర్తలు ప్రొటెస్ట్ చేశారు. భారీ ధర్నా నిర్వహించారు. దాదాపు 3,500 మందికి పైగా ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఇందులో ఎవరూ మాస్కులు ధరించకపోగా..భౌతిక దూరం పాటింపు అసలే లేదు. స్టాలిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలువురు నినాదాలు చేశారు. అయితే కోవిడ్ రూల్స్ పాటించకుండా వీరంతా ఇలా ప్రొటెస్ట్ చేశారంటూ పోలీసులు వీరిపై కేసులు పెట్టారు. రాష్ట్రంలో ఆంక్షలు సడలించినప్పటికీ కోవిడ్ ప్రొటొకాల్స్ ని ప్రతివారూ పాటించవలసిందేనని ప్రభుత్వం హెచ్చరిస్తోంది.పైగా దేశంలో కొన్ని చోట్ల మళ్ళీ ఈ కేసులు పెరుగుతున్నాయని ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు.

విల్లుపురంలో ఇంతమంది మాస్కులు లేకుండా, భౌతిక దూరం పాటించకుండా దీన్నినిర్వహించడం ఏ మాత్రం క్షంతవ్యం కాదని అంటున్నారు. పైగా థర్డ్ వేవ్ ముప్పు కూడా పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారని వారన్నారు. తమిళనాడులో గత 24 గంటల్లో 1767 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 29 మంది కోవిడ్ రోగులు మృతి చెందారు. 22,188 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పార్టీలకు, ప్రజలకు తెలియజేస్తున్నా వీరు కోవిడ్ రూల్స్ పాటించడం లేదని ప్రభుత్వం అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. అటు-తమ ప్రతిపాదనపై స్టాలిన్ సర్కార్ పునరాలోచన చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.

మరిన్ని ఇక్కడ చూడండి : News Watch : కన్నడిగులకు కొత్త సీఎం..మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్… ( వీడియో )

 పోలీసోడి బైకుకే పాము ఎసరు !చూసుకోకుండా బైక్ డ్రైవ్ చేసిన పోలీస్..ఎం జరిగిందో తెలుసా..?:Snake in police bike Video.

 బీటెక్ విద్యార్థులకు శుభవార్త..ఐటీ రంగంలో పుంజుకుంటున్న ఉద్యోగ అవకాశాలు..:B Tech Students video.

 వెంకటేష్ గారు ఫస్ట్ చదువుకోమన్నారు..! సిన్నప్ప ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ…:Narappa Movie Rakhi interview Video.