విమాన ప్రమాదం.. ఎయిర్ ఇండియా నుంచి ముగ్గురు కీలక ఉద్యోగుల తొలగింపునకు DGCA ఆదేశం!
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 270 మంది మరణించిన నేపథ్యంలో, డీజీసీఏ మూడుగురు సీనియర్ అధికారులను తొలగించింది. సిబ్బంది షెడ్యూలింగ్‌లోని లోపాలే ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తు వెల్లడించింది. ప్రమాదంలో మరణించిన వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. డీజీసీఏ అకౌంటబుల్ మేనేజర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది.

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 270 మంది ప్రాణాలు కోల్పోయిన తరువాత.. సిబ్బంది షెడ్యూలింగ్, రోస్టరింగ్‌కు సంబంధించిన విధుల నుండి ముగ్గురు సీనియర్ అధికారులను తొలగించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఎయిర్‌లైన్‌ను ఆదేశించింది. జూన్ 12న లండన్‌కు వెళ్తున్న బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం AI-171 అహ్మదాబాద్‌లోని BJ మెడికల్ కాలేజీ హాస్టల్ కాంప్లెక్స్‌పై టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోవడంపై విస్తృత దర్యాప్తులో భాగంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో సహా విమానంలో ఉన్న 241 మంది మరణించారు. మెడికల్ కాలేజ్ హాస్టల్‌లో ఉన్న విదార్థులు కూడా మృతి చెందారు.
ఈ ఘటనపై దర్యాప్తులో భాగంగా DGCA ఎయిర్‌లైన్ అకౌంటబుల్ మేనేజర్‌కు షో కాజ్ నోటీసు జారీ చేసింది. స్పాట్ చెక్‌లో విమాన విధి నిబంధనల ఉల్లంఘనలు వెల్లడయ్యాయని పేర్కొంది. రెగ్యులేటర్ ప్రకారం.. ఆ అధికారి మే 16, 17 తేదీల్లో బెంగళూరు నుండి లండన్‌కు (AI133) వరుసగా రెండు సుదూర విమానాలను నడిపారు. రెండూ అనుమతించబడిన విమాన సమయ పరిమితి 10 గంటలు మించిపోయాయి.
ఈ ఉల్లంఘనకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు ఎందుకు తీసుకోకూడదో ఏడు రోజుల్లోపు వివరించాలని ఏవియేషన్ వాచ్‌డాగ్ ఆ అధికారిని కోరింది. అదనంగా ఈ ఘటనలో పాల్గొన్న అధికారులందరిపై అంతర్గత క్రమశిక్షణా చర్యలు వెంటనే ప్రారంభించాలని, ఈ చర్యల ఫలితాన్ని 10 రోజుల్లోపు నివేదించాలని DGCA ఆదేశించింది.
తొలగించబడిన ముగ్గురు అధికారులు పైలట్ పని గంటలు, విశ్రాంతి సమయాలపై భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసే కీలకమైన విధులు నిర్వహించే సిబ్బంది. డ్యూటీ సైకిల్‌లను ప్లాన్ చేయడంలో ప్రత్యక్షంగా పాల్గొంటారు. వీరి ముగ్గురి తొలగించడంతో పర్యవేక్షణను తీవ్రంగా కఠినతరం చేయడాన్ని సూచిస్తుంది. ఇంతలో గుజరాత్ ప్రభుత్వం ప్రమాదంలో బాధితులను గుర్తించడానికి ప్రయత్నాలను కొనసాగిస్తోంది. 220 DNA నమూనాలను సరిపోల్చామని, 160 మంది భారతీయులు, 34 మంది బ్రిటిష్ జాతీయులు, ఏడుగురు పోర్చుగీస్ జాతీయులు, ఒక కెనడియన్ సహా 202 మంది బాధితుల అవశేషాలను వారి కుటుంబాలకు అప్పగించామని ఆరోగ్య మంత్రి రుషికేష్ పటేల్ శనివారం తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




