బడ్జెట్ సమర్పణకు ముందు.. 2018-19 ఎకనమిక్ సర్వే ఏం చెబుతోందంటే..

2019-20 సంవత్సరానికి పార్లమెంటులో తన కేంద్ర బడ్జెట్ ను సమర్పించడానికి ముందు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్.. గురువారం 2018-19 ఏడాదికి గాను ఆర్ధిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ రూపొందించిన ఈ సర్వే ప్రపంచంలోనే ఇండియా అతి పెద్ద ఐదో ‘ ఎకనామిక్ ‘ దేశంగా తయారయ్యేందుకు అనువైన సూచనలు, మార్గాన్ని ఇవ్వనుంది. 2024 సంవత్సరానికి భారత దేశం 5 ట్రిలియన్ యుఎస్ డాలర్ల మేర ఆర్థిక వ్యవస్థను సంతరించుకుని దీన్ని […]

బడ్జెట్ సమర్పణకు ముందు.. 2018-19 ఎకనమిక్ సర్వే ఏం చెబుతోందంటే..
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 04, 2019 | 3:51 PM

2019-20 సంవత్సరానికి పార్లమెంటులో తన కేంద్ర బడ్జెట్ ను సమర్పించడానికి ముందు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్.. గురువారం 2018-19 ఏడాదికి గాను ఆర్ధిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ రూపొందించిన ఈ సర్వే ప్రపంచంలోనే ఇండియా అతి పెద్ద ఐదో ‘ ఎకనామిక్ ‘ దేశంగా తయారయ్యేందుకు అనువైన సూచనలు, మార్గాన్ని ఇవ్వనుంది. 2024 సంవత్సరానికి భారత దేశం 5 ట్రిలియన్ యుఎస్ డాలర్ల మేర ఆర్థిక వ్యవస్థను సంతరించుకుని దీన్ని పూర్తిగా పునరుజ్జీవింపజేయాలన్నమోదీ ప్రభుత్వ లక్ష్యాలకు అవసరమైన సంస్కరణల రోడ్ మ్యాప్ కు ఈ సర్వే దోహదపడుతుందని భావిస్తున్నారు. అలాగే దేశం ముందున్న సవాళ్ళను ఎదుర్కోవడానికి తీసుకోవలసిన చర్యలను కూడా ఈ సర్వే సూచించవచ్చు. దేశ వార్షిక ఆర్థికాభివృధ్ది స్థాయిని ఇది ప్రతిబింబించవచ్ఛు . మోదీ 2.0 ప్రభుత్వంలో పూర్తి స్థాయి బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ శుక్రవారం ప్రవేశపెట్టనున్నారు. అసలు ఎకనమిక్ సర్వే అంటే.. జనవరి-మార్చి త్రైమాసికానికి దేశ ఎకానమీ 5. 8 శాతం ఉంది. ఇది చాలా తక్కువ అని, ఉత్పాదక, వ్యవసాయ రంగాల వృద్ది మందగమనంలో ఉన్నట్టు స్పష్టమవుతోందని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మోదీ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను ప్రధానంగా ఎదుర్కొంటున్న తరుణంలో ఈ సర్వే ప్రతిపాదించనున్న సూచనలను వారు మదింపు చేస్తున్నారు.

జీఎస్టీ వసూళ్లు ‘ సాదా సీదా ‘ గా ఉన్న నేపథ్యంలో.. ఆర్ధిక లోటును ఈ ఏడాది బడ్జెట్ ప్రస్తావించకపోవచ్ఛునని అంటున్నారు. రెండు వరుస నెలల్లో జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్ల మార్క్ ను దాటగా జూన్ లో పరోక్ష పన్నులు 99,936 కోట్లు ఉన్నాయి. అయితే ఏప్రిల్-జూన్ త్రైమాసికానికిసగటు నెలవారీ కలెక్షన్స్ రూ. 1. లక్ష కోట్లకు చేరింది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 7 శాతం ఎక్కువ. సుబ్రహ్మణ్యన్ కు ముందున్న చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అరవింద్ సుబ్రహ్మణ్యన్ తన రీసెర్చ్ పేపర్ లో భారత్ తన ఆర్థిక లోటును 2. 5 శాతం మేర ఓవర్ ఎస్టిమేట్ చేసిందని పేర్కొన్నారు. మొత్తం మీద దేశం ఎదుర్కొంటున్న సవాళ్ళను అధిగమించడానికి ఈ ఆర్ధిక సర్వే ఏ సూచనలు చేస్తుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Latest Articles
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..