AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Scam Call: వ్యభిచార రాకెట్‌లో కూతురు అరెస్టైనట్లు ఫేక్‌ కాల్‌.. గుండెపోటుతో స్కూల్ టీచర్ మృతి

ఆమె ఓ సాధారణ మధ్యతరగతి గృహిణి. బడిలో పాఠాలు చెబుతూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. స్కూల్లో ఉండగా పోలీస్‌ పేరుతో ఒక వ్యక్తి టీచర్‌కి వాట్సాప్‌ కాల్‌ చేశాడు. ఆమె కుమార్తె వ్యభిచార రాకెట్‌లో పట్టుబడి అరెస్ట్‌ అయ్యిందని, వీడియోలు లీక్‌ చేయకుండా ఉండేందుకు రూ.లక్ష ఇవ్వాలనేది సరదు ఫోన్‌ కాల్‌లోని వ్యక్తి చెప్పిన సారాంశం..

Scam Call: వ్యభిచార రాకెట్‌లో కూతురు అరెస్టైనట్లు ఫేక్‌ కాల్‌.. గుండెపోటుతో స్కూల్ టీచర్ మృతి
School Teacher Dies Of Heart Attack
Srilakshmi C
|

Updated on: Oct 04, 2024 | 5:41 PM

Share

లక్నో, అక్టోబర్‌ 4: ఆమె ఓ సాధారణ మధ్యతరగతి గృహిణి. బడిలో పాఠాలు చెబుతూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. స్కూల్లో ఉండగా పోలీస్‌ పేరుతో ఒక వ్యక్తి టీచర్‌కి వాట్సాప్‌ కాల్‌ చేశాడు. ఆమె కుమార్తె వ్యభిచార రాకెట్‌లో పట్టుబడి అరెస్ట్‌ అయ్యిందని, వీడియోలు లీక్‌ చేయకుండా ఉండేందుకు రూ.లక్ష ఇవ్వాలనేది సరదు ఫోన్‌ కాల్‌లోని వ్యక్తి చెప్పిన సారాంశం. దీంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైనా సదరు టీచర్‌ గుండెపోటుతో కుప్పకూలి మరణించింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలోని ఓ స్కూల్‌ల్లో టీచర్‌గా పని చేస్తున్న మల్తీ వర్మకు సెప్టెంబర్‌ 30న వాట్సాప్‌ కాల్‌ వచ్చింది. ఫోన్‌ చేసిన వ్యక్తి తాను పోలీస్‌నని తెలిపాడు. ఆమె కుమార్తె వ్యభిచార రాకెట్‌లో పట్టుబడి అరెస్ట్‌ అయ్యిందని చెప్పాడు. ఆమె కుమార్తె అసభ్య వీడియోలను లీక్‌ చేయకుండా ఉండాలంటే రూ.లక్ష అప్పటికప్పుడే ఆన్‌లైన్‌లో పంపించాలని బెదిరించాడు. దీంతో తీవ్ర ఆందోళన చెందిన మహిళా టీచర్‌ వెంటనే తన కుమారుడు దివ్యాన్షకు ఫోన్‌ చేసి ఈ విషయం తెలిపింది. కుమార్తెను ఈ కేసు నుంచి కాపాడుకునేందుకు ఆ వ్యక్తికి లక్ష ట్రాన్స్‌ఫర్‌ చేయాలని చెప్పింది. అయితే ఆమె తనకు వచ్చిన ఫోన్‌ కాల్‌ నంబర్‌ చెప్పమని అడగ్గా.. దానికి 92+ ప్రిఫిక్స్‌ ఉన్నట్లు గమనించాడు. పాకిస్థాన్‌ నుంచి వచ్చిన ఆ వాట్సాప్‌ కాల్‌ ఫేక్‌ అని, కంగారు పడవల్సిన అవసరం లేదని తల్లికి ఫోన్‌లో చెప్పాడు. అనంతరం తన సోదరికి ఫోన్‌ చేయగా తాను కాలేజీలో ఉన్నట్లు చెప్పింది. అయినప్పటికీ ఆమెలో భయం మాత్రం అంతకంత పెరగసాగింది. ఈ క్రమంలో సాయంత్రం 4 గంటల సమయంలో ఆమె స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే గుండెపోటుతో కుప్పకూలి పోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

‘డిజిటల్ అరెస్ట్’ కారణంగా మహిళ మృతి చెందిందన్న వార్తను కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేసింది. దేశంలో ‘డిజిటల్ అరెస్ట్’ ఘటన ఇది మొదటిది కాదని, నిత్యం ఇలాంటి కేసులు వెలుగులోకి వస్తున్నాయని తన పోస్టులో పేర్కొంది. సైబర్ నేరగాళ్లు నిరంతరం దేశ ప్రజలకు హాని చేస్తున్నారని కాంగ్రెస్ మండిపడింది. దేశంలో ఇలాంటి కేసులు సర్వసాధారణమైపోయాయని, వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.