Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Divorce: విడాకులు ఇవ్వడం ఇష్టంలేక.. కోర్టు నుంచి భార్యను ఎత్తుకెళ్లిన భర్త..!

భార్య భర్తలన్నాక చిన్నాచితక గిల్లికజ్జాలు సాధారణమే. ప్రతి కాపురంలో ఇవి ఉంటాయి. కొందరి విషయంతో ఇవి కాస్త శృతి మించి విడాకుల వరకు వెళ్తుంటారు. అలా విడాకుల కోసం ఓ జంట కోర్టుకి వెళ్లారు. అయితే విడాకులివ్వడం ఇష్టం లేని భర్త.. కోర్టులో విచారణ జరుగుతుండగానే భార్యను ఎత్తుకొని అక్కడి నుంచి పారిపోయాడు..

Divorce: విడాకులు ఇవ్వడం ఇష్టంలేక.. కోర్టు నుంచి భార్యను ఎత్తుకెళ్లిన భర్త..!
Domestic Violence
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 04, 2024 | 6:13 PM

భార్య భర్తలన్నాక చిన్నాచితక గిల్లికజ్జాలు సాధారణమే. ప్రతి కాపురంలో ఇవి ఉంటాయి. కొందరి విషయంతో ఇవి కాస్త శృతి మించి విడాకుల వరకు వెళ్తుంటారు. అలా విడాకుల కోసం ఓ జంట కోర్టుకి వెళ్లారు. అయితే విడాకులివ్వడం ఇష్టం లేని భర్త.. కోర్టులో విచారణ జరుగుతుండగానే భార్యను ఎత్తుకొని అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విచిత్ర ఘటన చైనాలో జరిగింది.

చైనాకు చెందిన లీకి, చెన్‌ అనే యువతీ యువకుడికి 20 ఏళ్లకే పెళ్లయ్యింది. వీరికి ఇద్దరు కొడుకులు, ఓ కూతురు సంతానం. అయితే భర్త రోజూ తాగొచ్చిన భార్యను నానా రకాలుగా హింసించేవాడు. భర్త పెట్టే టార్చర్‌ భరించలేక ఇక విడిపోవడమే మంచిదని నిర్ణయించుకున్న లీ గృహ హింస కింద కేసు పెట్టి, విడాకులకు దాఖలు చేసింది. వీరి కేసు విచారణకు రావడంతో దంపతులు ఇద్దరూ చెన్‌ కోర్టుకు హాజరయ్యారు. కోర్టులో లీ తన గోడును వెళ్లడించి కన్నీరు పెట్టుకుంది. పిల్లల పోషణ బాధ్యతల దృష్ట్యా సయోధ్య సాధ్యమని భావించిన కోర్టు తొలుత విడాకులకు నిరాకరించింది. చెన్‌ను మందలించి సవ్యంగా ఉండమని కోర్టు హెచ్చరించింది. దీంతో సదరు పతి దేవుడు కూడా భార్యకు క్షమాపణలు చెప్పి, మళ్లీ పునరావృతం చేయనని చెప్పాడు. అయినా భర్త తీరులో మార్పు లేకపోవడంతో లీ మళ్లీ కోర్టును ఆశ్రయించింది.

ఈసారి జడ్జి ఎక్కడ తీర్పు భార్యకు అనుకూలంగా ఇస్తారోనన్న భయంతో భర్త చెన్ భార్యను అమాంతం వీపుపై ఎక్కించుకుని కోర్టు హాల్‌ నుంచి బయటకు పరుగులు తీశాడు. అతడిని అడ్డుకునేందుకు లాయర్లు ఇతర అధికారులు తలో దిక్కు పరుగు తీశారు. ఎవరికీ చిక్కకుండా పారిపోయిన ఈ జంట.. ఆ తర్వాత క్షమాపణలు తెలుపుతూ సెప్టెంబర్‌ 2న కోర్టుకు లేఖ రాశారు. తన తప్పు తీవ్రత, దాని పర్యావసానాలు గ్రహించానని, భవిష్యత్తులో ఈ తప్పు పునరావృతం చేయబోనని తెలిపాడు. తనకు తన భార్యకు విడాకులు మంజూరు చేస్తారనే భయంతోనే భార్యను ఎత్తుకెళ్లానని క్షమాపణ లేఖలో భర్త చెన్‌ పేర్కొన్నాడు. ఇక ఈ జంట చేసిన హడావిడి చూసిన జడ్జి వీరిని విడదీయడం సబబు కాదని అనుకున్నరేమో.. వీరికి విడాకులు మంజూరు చేయలేదు. భర్తకు మరొక అవకాశం ఇవ్వాలని లీని కోర్టు కోరింది. భార్య లీ కూడా తాను ఎక్కడ దూరమైపోతుందోనని భర్త పడ్డ ఆవేదన చూసి కాస్త కరిగినట్లుంది. ఇకపై అయినా మారతాడేమో చూద్దామని భర్తకు మరో అవకాశం ఇచ్చేందుకు అంగీకరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.