TV9 Festival of India: దసరా సందడి వచ్చేసిందోచ్.. TV9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఎప్పటినుంచో తెలుసా..?
దసరా వచ్చేసింది.. సందడి తెచ్చేసింది.. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా నవరాత్రి వేడుకలు అంబరాన్నంటుతున్నాయి.. దుర్గా అమ్మవారికి పూజలు చేస్తూ.. రోజుకో అవతారంలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు.. ఈ తరుణంలో భారతదేశంలోని అతిపెద్ద మీడియా నెట్‌వర్క్.. టీవీ9 నెట్ వర్క్ మరింత జోష్ ను తీసుకువచ్చింది..
దసరా వచ్చేసింది.. సందడి తెచ్చేసింది.. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా నవరాత్రి వేడుకలు అంబరాన్నంటుతున్నాయి.. దుర్గా అమ్మవారికి పూజలు చేస్తూ.. రోజుకో అవతారంలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు.. ఈ తరుణంలో భారతదేశంలోని అతిపెద్ద మీడియా నెట్‌వర్క్.. టీవీ9 నెట్ వర్క్ మరింత జోష్ ను తీసుకువచ్చింది.. అటు ఆధ్మాత్మిక శోభ.. ఇటు పండగ వాతావరణం తీసుకువచ్చేందుకు.. TV9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియాను నిర్వహించనుంది.. మహా దుర్గా పూజతో పాటు అతిపెద్ద షాపింగ్, ఫుడ్ ఫెస్టివల్ తో TV9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియాను నిర్వహించనుంది..
9 అక్టోబర్ నుండి 13వ తేదీ వరకు TV9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా జరగనుంది.. దేశరాజధాని ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో ఈ వేడుక జరగనుంది.. బుధవారం నుంచి ఆదివారం (అక్టోబర్ 9 నుంచి 13 వతేదీ) వరకు ఉదయం 10:00 గంటల నుంచి రాత్రి 10:00 గంటల వరకు TV9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అంగరంగ వైభవంగా నిర్వహించనుంది.. ఇండియా గేట్ దగ్గరలో నిర్వహించే ఈ వేడుకకు టీవీ9 అందరినీ ఆహ్వానిస్తోంది..
ఐదు రోజులపాటు జరిగే TV9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో.. మహా దుర్గా పూజతో పాటు అతిపెద్ద లైఫ్‌స్టైల్, షాపింగ్, ఫుడ్ ఫెస్టివల్ జరగనుంది..
ఎత్తైన పండల్ లో దుర్గా మాత విగ్రహం ప్రతిష్ట.. పూజతోపాటు ప్రతిరోజు ప్రత్యక్ష దర్శనం ఉంటుంది..
ఇంటర్నేషనల్ లైఫ్‌స్టైల్ ఫెయిర్: వివిధ దేశాల నుండి 250+ షాపింగ్ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు.
థాయిలాండ్, టర్కీ, కొరియా, దుబాయ్, ఇటలీతోపాటు మరి కొన్ని దేశాల నుంచి స్టాల్స్
మల్టీ క్యూసిన్ ఫుడ్: ప్రపంచవ్యాప్తంగా రుచికరమైన వంటకాలు
సంగీతం – వినోదం: 30+ సంగీతకారులు – ప్రత్యక్ష ప్రదర్శనలు
వేదిక: మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియం, న్యూఢిల్లీ, ఇండియా గేట్.
విభిన్నమైన ఆనందాలు, అద్భుతమైన షాపింగ్, లైవ్ మ్యూజిక్, థ్రిల్లింగ్ వినోదాన్ని ఆస్వాదించవచ్చు.. భారతదేశంలోని ఉత్తమమైన వాటిని ఒకే చోట అనుభవించడానికి ఈ అవకాశాన్ని కోల్పోకండి.. దానికోసం TV9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో మాతో చేరండి.. ఆధ్యాత్మికశోభ.. డబుల్ ఎంజాయ్‌మెంట్.. మిస్ కాకండి..
Come join us at the TV9 Festival of India, the biggest lifestyle, shopping, food festival with Maha Durga Puja from 9th Oct to 13th Oct!
• DURGA PUJA LIVE DARSHAN WITH TALLEST PANDAL
• INTERNATIONAL LIFESTYLE FAIR: 250+ SHOPPING STALLS FROM VARIOUS COUNTRIES
• EXHIBITS FROM… pic.twitter.com/DuapNW9YkQ
— TV9 Telugu (@TV9Telugu) October 4, 2024
గతం కంటే భిన్నమైన రీతిలో ఈ వేడుకను టీవీ9 నెట్‌వర్క్ నిర్వహిస్తోంది.. సాంస్కృతిక వారసత్వం ప్రతిబింభించేలా.. ఉల్లాసమైన వాతావరణంలో వేడుక జరగనుంది.. ఈ ఐదు రోజుల కోలాహలం ఒక మరపురాని అనుభూతిగా నిలిచిపోనుంది..
షాపింగ్.. మంచి ఫుడ్, సంగీతం.. కార్నివాల్.. డబుల్ ఎంజాయ్‌మెంట్.. ఇంకెందుకు ఆలస్యం.. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులను సమీకరించండి.. అక్టోబర్ 9 నుంచి 13 వరకు మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో జరిగే.. TV9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో చేరండి..