ఖాకీ పవర్ చూపిస్తున్న ఢిల్లీ పోలీసులు.. ఎర్రకోట ఘటనపై విచారణ వేగవంతం.. నిందితులను అరెస్ట్ చేస్తున్న బృందాలు

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తోన్న రైతులు తమ ఆందోళనలో భాగంగా గణతంత్ర దినోత్సవం

ఖాకీ పవర్ చూపిస్తున్న ఢిల్లీ పోలీసులు.. ఎర్రకోట ఘటనపై విచారణ వేగవంతం.. నిందితులను అరెస్ట్ చేస్తున్న బృందాలు
Follow us
uppula Raju

|

Updated on: Feb 11, 2021 | 8:35 PM

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తోన్న రైతులు తమ ఆందోళనలో భాగంగా గణతంత్ర దినోత్సవం నాడు దేశ రాజధానిలో చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ రోజు రైతుల ముసుగులో నాశనం చేసిన ప్రతివాటికి లెక్కలు వేస్తున్నారు. అల్లర్ల ఘటనలో అభియోగాలు ఎదుర్కొంటూ గత కొన్నిరోజులుగా కన్పించకుండాపోయిన పంజాబీ నటుడు దీప్‌సిద్ధూను చండీగఢ్, అంబాలా మధ్యలోని జిరాక్‌పుర్‌ ప్రాంతంలో దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులకు హర్యానా పోలీసులు మద్దతు పలుకుతున్నారన్న నేపథ్యంలో వారికి సమాచారం అందించకుండా ఢిల్లీ పోలీసులు మాత్రమే కేసును ఛేదిస్తున్నారు. ఎర్రకోట ఘటనలో పాల్గొన్న దీప్‌సిద్ధూ అనుచరులు, మద్దతుదారులను అరెస్ట్ చేయడానికి ఢిల్లీ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పాటై గాలిస్తున్నారు.

ఇప్పటి వరకు ఈ కేసులో దీప్ సిద్దూ, ఇక్బాల్ సింగ్ రాగి అరెస్టుల అనంతరం ఇప్పుడు లక్ష, జుగ్రాజ్ సింగ్, గుర్జోత్ సింగ్, గుర్జంత్ సింగ్‌లపై దృష్టి పెట్టారు. అదేవిధంగా పరారీలో ఉన్న జజ్బీర్ సింగ్, బుటా సింగ్, సుఖ్‌దేవ్ సింగ్‌ల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. రిపబ్లిక్ డే రోజున జరిగిన హింసాత్మక ఘటనలో బాధితులైన పోలీసులు ఇప్పుడు ఈ కేసును వేగవంతంగా ముందుకు తీసుకువెళ్లడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అసలు నిందితులకు పంజాబ్ పోలీసులు మద్దతు పలుకుతున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపధ్యంలో ఢిల్లీ పోలీసులు వేగంగా స్పందిస్తూ ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు. దీనిపై పంజాబ్ పోలీసులు మండిపడుతున్నారు. మాకు కనీస సమాచరం లేకుండా అలా ఎలా చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఎర్రకోట ఘటన జరిగినప్పుడు చేతులో ఆయుధాలు ఉండి కూడా ఏమిచేయని నిస్సహాయ స్థితిలో ఉన్న ఢిల్లీ పోలీసులు ఇప్పడు వారి ప్రతాపం చూపిస్తున్నారు. అసలు నిందితులను వెతికి వెతికి పట్టుకుంటున్నారు.

Chandrababu Naidu: ఎన్నికలు సక్రమంగా నిర్వహించడంలో ఎస్‌ఈసీ విఫలం.. మండిపడుతున్న టీడీపీ అధినేత..

సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?