Chandrababu Naidu: ఎన్నికలు సక్రమంగా నిర్వహించడంలో ఎస్‌ఈసీ విఫలం.. మండిపడుతున్న టీడీపీ అధినేత..

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సక్రమంగా నిర్వహించడంలో ఎస్‌ఈసీ పూర్తిగా విఫలమైందని టీడీపీ అధినేత

Chandrababu Naidu: ఎన్నికలు సక్రమంగా నిర్వహించడంలో ఎస్‌ఈసీ విఫలం.. మండిపడుతున్న టీడీపీ అధినేత..
Follow us
uppula Raju

|

Updated on: Feb 11, 2021 | 7:44 PM

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సక్రమంగా నిర్వహించడంలో ఎస్‌ఈసీ పూర్తిగా విఫలమైందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఎస్‌ఈసీ తన అధికారాలు పూర్తిగా ఉపయోగించలేదని తప్పుబట్టారు. ఎస్‌ఈసీ విఫలమవడం వల్లే హైకోర్టును ఆశ్రయించామని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ మద్దతుదారులపైనే కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. అడ్డగోలుగా నామినేషన్లు తిరస్కరించి ఏకగ్రీవాలు చేసుకున్నారని, అభ్యర్థులకు రక్షణ కావాలని ఎస్‌ఈసీని కోరామని చంద్రబాబు పేర్కొన్నారు.

ఎస్‌ఈసీపై మంత్రి పెద్దిరెడ్డి ఇష్టారాజ్యంగా మాట్లాడారని, అధికారులను బెదిరించిన పెద్దిరెడ్డిని బర్తరఫ్‌ చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో దుస్థితిపై సీఈసీకి ఫిర్యాదు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రపతి, కేంద్రహోంమంత్రికి కూడా వివరాలు పంపుతున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో అధికారులు అధికార దుర్వినియోగం చేస్తున్నారని, చట్టం ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎస్‌ఈసీదే బాధ్యత వహించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

ఆ ప్లేయర్‌ని ఈసారికి విడిచిపెట్టండి.. తమిళనాడు క్రికెట్ సంఘాన్ని కోరిన బీసీసీఐ.. ఎందుకో తెలుసా..