మాజీ మేయర్‌పై మంత్రి కేటీఆర్‌ ప్రశంసలు.. హైదరాబాద్‌ అభివృద్ధికి అద్భుతమైన కృషి అని ట్వీట్‌

జీహెచ్‌ఎంసీకి నూతన మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికయ్యారు. మేయర్‌గా ఎంపీ కే.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా..

మాజీ మేయర్‌పై మంత్రి కేటీఆర్‌ ప్రశంసలు.. హైదరాబాద్‌ అభివృద్ధికి అద్భుతమైన కృషి అని ట్వీట్‌
Follow us

|

Updated on: Feb 11, 2021 | 7:17 PM

జీహెచ్‌ఎంసీకి నూతన మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికయ్యారు. మేయర్‌గా ఎంపీ కే.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలతారెడ్డి ఎన్నికయ్యారు. ఇక ఇప్పటి వరకు మేయర్‌గా వ్యవహరించిన బొంతు రామ్మోహన్‌ మాజీ అయిపోయారు. ఈ నేపథ్యంలో బొంతు రామ్మోహ‌న్‌పై టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు.

ఈ ఐదేళ్ల కాలంలో హైద‌రాబాద్ అభివృద్ధి కోసం బొంతు రామ్మోహన్‌ అద్భుత‌మైన కృషి చేశార‌ని మంత్రి కేటీఆర్‌ ప్రశంసించారు. నిన్నటితో మేయ‌ర్‌గా తన ప‌ద‌వీ కాలం ముగియ‌డంతో బొంతు రామ్మోహన్‌ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ర్టంలో జీహెచ్ఎంసీకి తొలి మేయ‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌డం త‌న అదృష్టంగా భావిస్తున్నాన‌ని రామ్మోహ‌న్ పేర్కొన్నారు. ఈ అవ‌కాశం ఇచ్చిన ముఖ్య‌మంత్రి కేసీఆర్, కేటీఆర్‌కు హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ ఐదేళ్ల కాలంలో త‌న‌ను ఆద‌రించిన ప్ర‌తి ఒక్క‌రికీ హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు.

హైద‌రాబాద్ అభివృద్ధి కోసం త‌న శ‌క్తి మేర కృషి చేశాన‌ని పేర్కొన్నారు. ఈ అంద‌మైన జ‌ర్నీలో మ‌రిచిపోలేని జ్ఞాప‌కాలు ఎన్నో అని రామ్మోహ‌న్ తెలిపారు. ఇవ‌న్నీ త‌న జీవితాంతం గుర్తుండిపోతాయ‌ని పేర్కొన్నారు. త‌న‌పై ప్రేమ చూపించిన ప్ర‌తీ హైద‌రాబాదీకి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్న‌ట్లు బొంతు రామ్మోహ‌న్ ట్వీట్ చేశారు. బొంతు ట్వీట్‌ను ట్యాగ్‌ చేసిన మంత్రి కేటీఆర్‌ ప్రశంసలతో రీ ట్వీట్‌ చేశారు.

Read more:

ఆ పాట నేను వంద సార్లు విన్నా.. మీరు కూడా విని ప్రజల కష్టాలు తీర్చండి.. మేయర్‌, డిప్యూటీ మేయర్లకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు