నంద్యాల అర్.డి.ఓ ఆఫీసు వద్ద ఆందోళన.. ఆ పంచాయతీ స్థానాల్లో రీకౌంటింగ్‌ జరపాలని డిమాండ్‌

రెండు గ్రామాల్లో రీకౌంటింగ్ జరిపించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తహశీల్దార్ కు, సబ్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. నిరసన కార్యక్రమంలో..

  • K Sammaiah
  • Publish Date - 7:07 pm, Thu, 11 February 21
నంద్యాల అర్.డి.ఓ ఆఫీసు వద్ద ఆందోళన.. ఆ పంచాయతీ స్థానాల్లో రీకౌంటింగ్‌ జరపాలని డిమాండ్‌

కర్నూలు జిల్లా నంద్యాల అర్.డి.ఓ ఆఫీసు వద్ద బుక్కాపురం, బిల్లలాపురం గ్రామస్థులు అందోళన చేపట్టారు. నిన్న జరిగిన పంచాయితీ ఎన్నికల కౌంటింగ్ లో తమకు అన్యాయం జరిగిందంటూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. రెండు గ్రామాల్లో రీకౌంటింగ్ జరిపించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తహశీల్దార్ కు, సబ్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. నిరసన కార్యక్రమంలో టిడిపి మాజీ మంత్రి ఫరూఖ్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి లు పాల్గొన్నారు.

ఈసందర్భంగా మాజీమంత్రి ఫరూక్, మాజీ ఎమ్మెల్యే భూమాబ్రహ్మానంద రెడ్డి లు మాట్లాడుతూ.. నంద్యాల మండలం బిల్లా పురం, మహానంది మండలం బుక్కాపురం గ్రామాలలో టీడీపీ మద్దతుదారులు 14 ఓట్లతో ఒకరు, ఒక ఓటుతో మరొకరు ఓడిపోయినట్టు రిటర్నింగ్ ఆఫీసర్ డిక్లరేషన్ ఇచ్చారని, అభ్యర్థులు ఒకసారి రీకౌంటింగ్ చేయాలని ఎంత బతిమిలాడినా అధికారులు రాజకీయ నాయకులు ఒత్తిళ్లకు తలొగ్గి ప్రత్యర్థులే విజయం సాధించారని ప్రకటించడం చాలా అన్యాయమన్నారు.

ప్రస్తుతం జరిగిన ఎన్నికలు అప్రజాస్వామ్యానికి నిదర్శమని, ఎన్నికల్లో అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి పనిచేశారని విమర్శించారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టామని చెప్పిన మీరు ఇప్పుడు ఈ ఎన్నికల కోసం అధికారులను పావుగా వాడుకొని గెలివాలని చూస్తున్నారని, మీరు అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేసి ఉంటే అధికారులను, డబ్బును ఉపయోగించకుండా గెలవలేరా అని ప్రశ్నించారు.

 

Read more:

మన్యం ఎన్నికలపై మావోయిస్టుల ప్రభావం.. ఆ స్థానాల్లో నామినేషన్‌కు ముందుకు రాని అభ్యర్థులు