కంగనపై ప్రకాష్ రాజ్ అటాక్.!
కొన్ని రోజులుగా సంచలన ప్రకటనలు.. చేష్టలతో మహారాష్ట్ర ప్రభుత్వ పెద్దలని ఢీ కొడుతూ తరచూ వార్తల్లో నిలుస్తోంది బాలీవుడ్ నటి కంగన రనౌత్. ఇవి.. నటుడు ప్రకాష్ రాజ్ కు ఏమాత్రం మింగుడుపడ్డం లేనట్టుంది. కంగనను టార్గెట్ చేస్తూ...
కొన్ని రోజులుగా సంచలన ప్రకటనలు.. చేష్టలతో మహారాష్ట్ర ప్రభుత్వ పెద్దలని ఢీ కొడుతూ తరచూ వార్తల్లో నిలుస్తోంది బాలీవుడ్ నటి కంగన రనౌత్. ఇవి.. నటుడు ప్రకాష్ రాజ్ కు ఏమాత్రం మింగుడుపడ్డం లేనట్టుంది. కంగనను టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజ్ వరుస విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల ఆమెకు వై ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించిన నేపథ్యంలోనూ ప్రకాష్ రాజ్ ఘాటు విమర్శలు చేశారు. దిక్కూ దివానం లేకుండా రోడ్లపై నడుస్తూ సొంతూళ్లకు వెళ్తున్న వలస కూలీల ఫొటోలను ఒక పక్క.. కంగనాకు భద్రత కల్పిస్తూ చుట్టూ ఉన్న భద్రతా సిబ్బందిని చూపిస్తూ ఉన్న ఫొటోను మరోపక్క ఉంచి.. ‘అవును.. ఇదే కొత్త భారతదేశం’ అంటూ కామెంట్ చేశారు ప్రకాష్ రాజ్. తాజాగా మళ్లీ ఇదే రేంజ్ లో ఫొటోలు ఉంచి సరికొత్త విమర్శలకు దిగారు. రాణి లక్ష్మీభాయి శౌర్యాన్ని, త్యాగాలను తాను సినిమా ద్వారా చూపించానంటూ, నిజజీవితంలోనూ ఎవరికీ తల వంచనంటూ ఇటీవల కంగనా చేసిన కామెంట్ కు కౌంటర్ అన్నట్టుగా ఉంది ఆయన చేసిన తాజా విమర్శ. ‘ఒక్క సినిమాతో కంగనా రనౌత్ తనను తాను రాణి లక్ష్మీబాయితో పోల్చుకుంటే.. మరి పద్మావతిగా నటించిన దీపికా పదుకుణె, అక్బర్ గా నటించిన హృతిక్ రోషన్, అశోక చక్రవర్తిగా నటించిన షారుక్, భగత్ సింగ్ గా నటించిన అజయ్, మంగళ్ పాండేగా నటించిన ఆమిర్ ఖాన్, మోదీగా నటించిన వివేక్ ల పరిస్థితేంటని నర్మగర్భంగా ప్రశ్నించారు ప్రకాష్ రాజ్. ఇలాఉంటే, కంగనకు బీజేపీ మద్దతు ఉందన్న ప్రచారం నేపథ్యంలో ప్రకాష్ రాజ్ ఇలా స్పందిస్తున్నారాన్నది గమనార్హం.
Yes… New INDIA #justasking https://t.co/yAWVkNJkWY
— Prakash Raj (@prakashraaj) September 9, 2020
#justasking pic.twitter.com/LlJynLM1xr
— Prakash Raj (@prakashraaj) September 12, 2020