కరోనా అప్‌డేట్స్‌: రష్యాకు చేరువలో మహారాష్ట్ర

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇక మహారాష్ట్రలో కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉండగా.,  అత్యథిక కరోనా కేసుల లిస్ట్‌లో

కరోనా అప్‌డేట్స్‌: రష్యాకు చేరువలో మహారాష్ట్ర
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 12, 2020 | 1:56 PM

Maharashtra Corona updates: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇక మహారాష్ట్రలో కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉండగా.,  అత్యథిక కరోనా కేసుల లిస్ట్‌లో ఆ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. కొన్ని రోజులుగా ప్రతిరోజు అక్కడ 20వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 10,15,681గా ఉంది. ఇక మరో రెండు, మూడు రోజుల్లో రష్యా(10,51, 874)ను మహారాష్ట్ర దాటేయనున్నట్లు అర్థమవుతోంది.

అయితే మరోవైపు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య అక్కడ పెరుగుతోంది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 7,15,023కు చేరింది. దీంతో రిక‌వ‌రీ రేటు 70.4%గా ఉంది. ఇక ఇప్పటివరకు 28,724 మంది ఆ రాష్ట్రంలో చనిపోగా.. మ‌ర‌ణాల రేటు 2.83%గా ఉంది. పరీక్షల సంఖ్య 50లక్షలు దాటేయగా.. పరీక్షలు ఎక్కువగా జరుపుతుండటంతోనే పాజిటివ్ కేసులు ఎక్కువగా వస్తున్నట్లు అక్కడి ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇదిలా ఉంటే దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో రైల్వే సేవలు పునః ప్రారంభం అయినా మహారాష్ట్రంలోని ముంబయిలో నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో రైలు సేవలను ప్రారంభిస్తే సెకండ్ వేవ్ మొదలవుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో రైల్వేలను ప్రారంభించేందుకు అక్కడి అధికారులు సిద్ధంగా లేరు. అయితే భార‌త ఆర్థిక రాజ‌ధానిగా ఉన్న ముంబయిలో ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే మ‌న్ముందు చాలా కష్టమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Read More:

సుశాంత్‌ని అలా అనుకునేవాళ్లు తెలివిలేని వాళ్లు.. డెన్మార్క్‌ సింగర్ కీలక విషయాలు

నటి తెలివితేటలు.. ‘డ్రగ్’ టెస్ట్‌లో దొరక్కుండా ‘యూరిన్’‌లో నీళ్లు