AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండోర్‌లో హృదయ విదారక ఘటన

వివాహమైన నూతన దంపతులను మృత్యువు వెంటాడింది. పెళ్లి చేసిన సంతోషం ఆ ఇరువురి కుటుంబాల్లో ఎంతో కాలం నిలువలేదు. పట్టుమని రెండు వారాలైన గడవకముందే ఆ నూతన జంట తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.

ఇండోర్‌లో హృదయ విదారక ఘటన
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 12, 2020 | 2:15 PM

Share

వివాహమైన నూతన దంపతులను మృత్యువు వెంటాడింది. పెళ్లి చేసిన సంతోషం ఆ ఇరువురి కుటుంబాల్లో ఎంతో కాలం నిలువలేదు. పట్టుమని రెండు వారాలైన గడవకముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది ఆ నూతన జంట. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ లో జరిగిన ఈ విషాద ఘటన ప్రతి ఒక్కరినీ కదిలించింది.

ఈ హృదయ విదారక ఘటన ఇండోర్ లో జరిగింది. పెళ్లయిన 15 రోజులకే రోడ్డు ప్రమాదం భర్తను బలి తీసుకోగా భార్యా భవనం పైనుంచి దూకి మృత్యువుతో పోరాడుతోంది. ఇండోర్‌కు చెందిన యువతి(28), ఉజ్జయినికి చెందిన యువకుడిని 15 రోజుల క్రితం వివాహం చేసుకుంది. దంపతులు ఇండోర్‌లో కాపురం పెట్టగా బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందాడు.

దీంతో తీవ్ర మనోవేదనకు గురైన భార్య షాపింగ్‌మాల్ మూడో అంతస్తు పైనుంచి దూకింది. సెక్యూరిటీ గార్డులు, సిబ్బంది ఆమెను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. భర్తతో కలిపి తన దహన సంస్కారాలు చేయాలని యువతి రాసిన సూసైట్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సబ్ ఇన్‌స్పెక్టర్‌ ఆర్ కుమ్రావత్ తెలిపారు.

బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. యువతి షాపింగ్‌ మాల్‌ పైనుంచి దూకిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Follow Us
ఈసారి చూడబోయేది దశావతారమే.. బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమో వైరల్.
ఈసారి చూడబోయేది దశావతారమే.. బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమో వైరల్.
ఇప్పుడు తెలుగులో ఈ నటుడి పేరు మార్మోగుతుంది..ఎవరో గుర్తు పట్టారా?
ఇప్పుడు తెలుగులో ఈ నటుడి పేరు మార్మోగుతుంది..ఎవరో గుర్తు పట్టారా?
ఫిష్ అక్వేరియం ఈ దిశలో ఉంటే.. చేతి నిండా సంపద!
ఫిష్ అక్వేరియం ఈ దిశలో ఉంటే.. చేతి నిండా సంపద!
ఇదేందయ్యా ఇది.. ఈ బొద్దింక ధర రూ. 1.34 కోట్లా..
ఇదేందయ్యా ఇది.. ఈ బొద్దింక ధర రూ. 1.34 కోట్లా..
నిమ్స్ డాక్టర్ల అద్భుతం.. తలపై చిన్న మచ్చ లేకుండా బ్రెయిన్..
నిమ్స్ డాక్టర్ల అద్భుతం.. తలపై చిన్న మచ్చ లేకుండా బ్రెయిన్..
కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తోందా..?
కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తోందా..?
పల్లెటూర్లలో చెట్ల కింద కూర్చొని పేదోళ్ళ పొలం పచ్చడి తింటే అమృతమే
పల్లెటూర్లలో చెట్ల కింద కూర్చొని పేదోళ్ళ పొలం పచ్చడి తింటే అమృతమే
సింహంపై సవారీ.. భారత్‌లో బైక్ రైడింగ్..ట్రంప్ వీడియో చూశారంటే..
సింహంపై సవారీ.. భారత్‌లో బైక్ రైడింగ్..ట్రంప్ వీడియో చూశారంటే..
మృగశిర కార్తెకు ముందే పండగ.. చెరువులోని చేపల లూటీ..
మృగశిర కార్తెకు ముందే పండగ.. చెరువులోని చేపల లూటీ..
3 బాయిల్డ్ ఎగ్స్ రూ. 500లు, పరాటా రూ. 1100లు.. ఈ బిల్ చూస్తే షాకే
3 బాయిల్డ్ ఎగ్స్ రూ. 500లు, పరాటా రూ. 1100లు.. ఈ బిల్ చూస్తే షాకే