Karnataka: పెళ్లి చేసుకునేందుకు సమయం అడిగిందని.. ప్రేయసి ముఖంపై యాసిడ్ పోశాడు.. చివరికి
మహిళలు, యువతులపై నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వేధింపులు, దాడులు, అత్యాచారాలు, దాడులు నిత్యకృత్యమయ్యాయి. దీంతో ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. వీటిని నియంత్రించేందుకు....
మహిళలు, యువతులపై నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వేధింపులు, దాడులు, అత్యాచారాలు, దాడులు నిత్యకృత్యమయ్యాయి. దీంతో ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. వీటిని నియంత్రించేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఫలితంగా సమాజంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా కర్ణాటక(Karnataka) రాజధాని బెంగళూరు(Bangalore) నగరంలో ఇలాంటి ఘటనే జరిగింది. ప్రేమించిన యువతి తనను పెళ్లి చేసుకోవడం లేదన్న కారణంతో ఓ వ్యక్తి యాసిడ్ తో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె కంటికి తీవ్ర గాయం కాగా.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందతోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో నివాసముండే అహ్మద్.. ఓ యువతిని ప్రేమించాడు. తనను పెళ్లి చేసుకోవాలంటూ అహ్మద్ ఆ యువతిని వేధించడం ప్రారంభించాడు. అతడి వేధింపులు తాళలేని బాధితురాలు తనకు ఇంకా సమయం కావాలని, ఆలోచించుకుని తర్వాత నిర్ణయం చెబుతానని వెల్లడించింది.
దీనికి ఒప్పుకోని నిందితుడు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వివాదం జరిగింది. కోపోద్రిక్తుడైన అహ్మద్ యువతిని సరక్కి సిగ్నల్వద్ద అడ్డగించి యాసిడ్పోసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని, బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. యాసిడ్ దాడి ఘటనలో బాధితురాలి కుడి కంటికి తీవ్ర గాయమైంది. ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి