Viral: కుక్కను పెంచుకునేందుకు పర్మిషన్ ఇవ్వలేదని.. కూతురిలో కలిసి తల్లి దారుణం..
పెంపుడు జంతువులను ఇంట్లో పెంచుకోవడం సహజమే. కుక్కలు, పిల్లులను సొంత కుటుంబసభ్యులు గా ఫీల్ అవుతారు. వాటి ఆలనాపాలనా చూసుకుంటూ సంతోషంగా గడిపేస్తుంటారు. వాటికి ఏ కష్టం వచ్చినా చూసి తట్టుకోలేరు. బెంగళూరులో...
పెంపుడు జంతువులను ఇంట్లో పెంచుకోవడం సహజమే. కుక్కలు, పిల్లులను సొంత కుటుంబసభ్యులు గా ఫీల్ అవుతారు. వాటి ఆలనాపాలనా చూసుకుంటూ సంతోషంగా గడిపేస్తుంటారు. వాటికి ఏ కష్టం వచ్చినా చూసి తట్టుకోలేరు. బెంగళూరులో ఇలాంటి ఘటనే జరిగింది. కుక్కను పెంచుకునేందుకు ఇంట్లో వాళ్లు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఓ మహిళ తన కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరులో శ్రీనివాస్ అనే వ్యక్తి నివాసముంటున్నారు. అతనికి భార్య దివ్య, 13 ఏళ్ల కుమార్తె ఉన్నారు. అయితే దివ్యకు శునకాలు అంటే చాలా ఇష్టం. వాటిని పెంచుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపించేది. అయితే ఆమెకు ఆరోగ్యం దెబ్బతినడంతో కుక్కను పెంచుకునేందుకు కుటుంబసభ్యులు నిరాకరించారు. అలర్జీ కారణంగా శునకాన్ని ఇంట్లో ఉంచుకోవద్దని ఆమె అత్త నిబంధన విధించింది. ఈ పరిణామంతో దివ్య మనస్తాపానికి గురైంది. కుక్కును పెంచుకోనివ్వరని నిరాశకు గురైంది. తీవ్ర మనస్తాపం చెందింది. దివ్య తన కుమార్తెతో కలిసి గది లోపలికి వెళ్లి తలుపు వేసుకుంది. కంగారు పడిన కుటుంబసభ్యులు ఎంత పిలిచినా బయటకు రాలేదు. లోపలే కుమార్తెతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. తలుపులు పగలగొట్టి లోపలకు వెళ్లి చూసిన అత్తమామలకు షాకింగ్ దృశ్యాలు కనిపించాయి. గదిలో కోడలు, మనవరాలు విగతజీవిగా కనిపించడంతో షాక్ అయ్యారు.
సమచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. దివ్య భర్త శ్రీనివాస్, అత్త వసంత, బావ జనార్దన్ లపై గోవింద్ పురా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దివ్య శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతోందని, ఆమె ఆరోగ్యం మెరుగుపడాలంటే కుక్కలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచించారని పోలీసులు తెలిపారు. కుక్కను పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని దివ్య తన భర్తను, అత్తమామలను కోరిందని.. అయితే వారు ఆమె అభ్యర్థనను తిరస్కరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..