AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఇదేమి ప్రేమరా నాయనా.. నెట్టింట నవ్వులు పూయిస్తోన్న వీడియో.. చూస్తే పొట్టచెక్కలవ్వాల్సిందే..

భార్యాభర్తలు అన్నాక గిల్లిగజ్జాలు, అలకలు, కోపతాపాలు చాలా కామన్. ఇక పోతే వారి మధ్య ఉండే ప్రమానురాగాలకూ ఏ మాత్రం కొదవ ఉండదు. దంపతుల్లో ఎవరో ఒకరు అప్పుడప్పుడు చేసే చిలిపి పనులు నవ్వులు తెప్పిస్తుంటాయి....

Video: ఇదేమి ప్రేమరా నాయనా.. నెట్టింట నవ్వులు పూయిస్తోన్న వీడియో.. చూస్తే పొట్టచెక్కలవ్వాల్సిందే..
Wife Husband Video
Ganesh Mudavath
|

Updated on: Nov 12, 2022 | 1:57 PM

Share

భార్యాభర్తలు అన్నాక గిల్లిగజ్జాలు, అలకలు, కోపతాపాలు చాలా కామన్. ఇక పోతే వారి మధ్య ఉండే ప్రమానురాగాలకూ ఏ మాత్రం కొదవ ఉండదు. దంపతుల్లో ఎవరో ఒకరు అప్పుడప్పుడు చేసే చిలిపి పనులు నవ్వులు తెప్పిస్తుంటాయి. కొన్ని సార్లు చిరాకు కలిగిస్తుంటాయి. వీటన్నింటిని కలుపుకుని ముందుకు వెళ్తేనే సంసార జీవితం ఆనందంగా సాగిపోతుంది. లేకుండా గొడవలు తప్పవు. ఇవి కొన్ని సార్లు తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయి. ఇలాంటి ఘటనలు మనం ఎన్నో చూశాం. అయితే కొన్ని సార్లు అక్కడి పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు చేసే చిన్న చిన్న ప్రయత్నాలు నవ్వులు పూయిస్తుంటాయి. భార్యాభర్తల మధ్య జరిగే ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ కు కొదవ లేదు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో షార్ట్స్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. నెటిజన్లు తమకు వచ్చిన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ తమ ట్యాలెంట్ ను బయటపెడుతున్నారు. వీటిలో ముఖ్యంగా భార్యాభర్తలు కలిసి చేసే వీడియోలు చాలా పాపులర్ అవుతున్నాయి. ఇలాంటి వాటిని చూసేందుకు సోషల్ మీడియా యూజర్లు ఆసక్తి చూపిస్తుంటారు. ఇలాంటి వీడియోలకు ఇంటర్నెట్ లో కొదవ లేదు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వైరల్ అవుతున్న ఈ క్లిప్ లో ఇద్దరు వ్యక్తులను మనం చూడవచ్చు. చూసేందుకు వారిద్దరూ భార్యాభర్తలులాగానే కనిపిస్తున్నారు. ఈ వీడియాలో భర్త భోజనం చేసి చేయి కడుక్కునేందుకు వాష్ బేసిన్ వద్దకు వెళ్తాడు. అదే సమయంలో అక్కడ తన భార్య గిన్నెలను శుభ్రపరుస్తోంది. అతను హ్యాండ్ వాష్ చేసుకుంటాడు. అయితే చేతులు తుడుచుకోవడానికి అతని వద్ద క్లాత్ లేదు. దీంతో ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా అతనికి మెరుపు లాంటి ఆలోచన తట్టింది. తన భార్యను దగ్గరకు తీసుకుని, ప్రేమగా నిమిరాడు. అంతటితో ఆగకుండా ఆమె వేసుకున్న టీ షర్ట్ తో చేతులు తుడుచుకున్నాడు. ఇక అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. ఈ విషయం తెలియని భార్య తన భర్త చూపించిన ప్రేమను నిజమనుకుని మురిసిపోవడం విశేషం.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by ????? ??????? (@abin_abzz__)

ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. అప్ లోడ్ అయిన కొద్ది సమయంలోనే వేల సంఖ్యలో వ్యూస్, వందల సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి. అంతే కాకుండా ఈ సంఖ్య మరింతగా పెరుగుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..