Haryana Violence: అయ్యో పాపం.. ముగ్గురుని కాపాడాడు.. చివరికి అతని ఇంటినే కూల్చేసిన ప్రభుత్వం..
హర్యానాలో శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది. అధికార ప్రభుత్వం ఈ అల్లర్లకు పాల్పడిన వాళ్లలో ఒక వర్గానికి చెందిన వారి ఇళ్లను, ఆస్తులను ధ్వంసం చేయడం ప్రారంభించింది. ఇదిలా ఉండగా అల్లర్లు జరుగుతున్న సమయంలో రవీంద్ర ఫోగట్, అతని స్నేహితులు ప్రాణాలు కాపాడుకునేందుకు అనీష్ ఇంట్లోకి వచ్చారు.

ఇటీవల హర్యానాలోని నూహ్ జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అల్లర్లు చెలరేగిన రోజున హిసార్ అనే ప్రాంతానికి చెందినవారికి ఆశ్రయమిచ్చినందుకు అనీష్ వ్యక్తిపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరికి అతని ఇంటిని బుల్డోజర్‌తో కూల్చివేసింది. వాస్తవానికి అక్కడ చెలరేగిన అల్లర్లతో అనీష్‌కు సంబంధం లేదు. అయినప్పటికీ కూడా స్నేహితులకు ఆశ్రయం కల్పించాడనే కారణంలో ప్రభుత్వం అతని ఇంటిని కూల్చేలా చర్యలు తీసుకుంది. నూహ్ జిల్లాలో విశ్వహిందూ పరిషత్ ఓ భారీ ర్యాలీ నిర్వహిస్తుండగా ఓ అల్లరి మూక వాళ్లపై రాళ్ల దాడి చేసింది. ఆ తర్వాత రెండు వర్గాల మధ్య ఘర్షణలకు దారి తీశాయి. అయితే ఈ హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అలాగే వందలాది గాయపడ్డారు. ఈ దాడుల వల్ల నూహ్ జిల్లా మూడు రోజుల పాటు అట్టుడికింది.
మరోవైపు హర్యానాలో శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది. అధికార ప్రభుత్వం ఈ అల్లర్లకు పాల్పడిన వాళ్లలో ఒక వర్గానికి చెందిన వారి ఇళ్లను, ఆస్తులను ధ్వంసం చేయడం ప్రారంభించింది. ఇదిలా ఉండగా అల్లర్లు జరుగుతున్న సమయంలో రవీంద్ర ఫోగట్, అతని స్నేహితులు ప్రాణాలు కాపాడుకునేందుకు అనీష్ ఇంట్లోకి వచ్చారు. అయితే అనీష్ వారిపై జాలి చూపించాడు. వాళ్లను కాపాడాలనే ఆలోచనతో తన ఇంట్లో వారికి ఆశ్రయమిచ్చాడు. ఈ కారణంతోనే హర్యానా ప్రభుత్వం అనీష్‌పై మండిపడింది. వారికి ఎందుకు ఆశ్రయం కల్పించారంటూ నిలదీసింది. చివరికి అతని ఇంటిని బుల్డోజర్‌తో కూల్చివేసింది. ఇదిలా ఉండగా హర్యానా హోమంత్రి అనిల్ విజ్ ఈ విషయంపై తన స్పందన తెలియజేశారు. ఈ చర్యలు చేపట్టడంలో బుల్డోజర్లు ఒక భాగం మాత్రం అని వ్యాఖ్యానించారు.
అలాగే ఈ ఘననపై రవీంద్ర ఫోగట్ కూడా స్పందించారు. తాను ఒక కాంట్రాక్టరని చెప్పాడు. అల్లరి మూకల దాడులు జరిగిన సమయంలో ప్రాణాలు కాపాడుకునేందుకు అనీష్ ఇంట్లో ఆశ్రమం పొందినట్లు పేర్కొన్నారు. ఈ అల్లర్లలో తన కారు కూడా పూర్తిగా ధ్వంసమైందని.. కొద్దిసేపటి తర్వాత పరిస్థితులు అదుపులోకి వచ్చాక అనీష్ తన కారులో పీడబ్య్లూడీ గెస్ట్ హౌస్ వద్ద తనను దింపాడని చెప్పారు. చేయని తప్పుకు అనీష్ తన ఇల్లును కోల్పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. మరో విషయం ఏంటంటే అకారణంగా బుల్డోజర్ విధ్వంసాలకు గురైన ఇల్ల సంఖ్య నూహ్ జిల్లాలో ఎక్కువగానే ఉంది. మరోవైపు ఈ కూల్చివేతలపై హైకోర్టు సిరయస్ అయ్యింది. అధికారం అవినీతికి కారణం కాగా.. సంపూర్ణ అధికారం వ్యవస్థను భ్రష్టు పట్టిస్తుందని లార్ట్ ఆక్టన్ చెప్పిన మాటలను గుర్తుకు చేసింది.




మరిన్ని జాతీయ వార్తల కోసం..