AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MK Stalin: వెరీ పవర్‌ఫుల్‌ ఉమెన్స్‌.. తమిళనాడు సీఎం స్టాలిన్ భద్రతాదళంలో నవదుర్గలు..

తమిళనాడు సీఎం స్టాలిన్ భద్రతాదళంలో 9 మంది నవదుర్గలు.. అవును ఇప్పుడు.. ఇదే దక్షిణాదిన బాగా ట్రెండ్ అవుతోంది. సాధారణంగా విఐపీలో భద్రతదళంలో ఎప్పుడూ పురుషుల్నే చూస్తూ ఉంటాం.

MK Stalin: వెరీ పవర్‌ఫుల్‌ ఉమెన్స్‌.. తమిళనాడు సీఎం స్టాలిన్ భద్రతాదళంలో నవదుర్గలు..
Stalin Security
Shaik Madar Saheb
|

Updated on: Dec 14, 2022 | 9:09 AM

Share

తమిళనాడు సీఎం స్టాలిన్ భద్రతాదళంలో 9 మంది నవదుర్గలు.. అవును ఇప్పుడు.. ఇదే దక్షిణాదిన బాగా ట్రెండ్ అవుతోంది. సాధారణంగా విఐపీలో భద్రతదళంలో ఎప్పుడూ పురుషుల్నే చూస్తూ ఉంటాం. కానీ స్టాలిన్ తన సెక్యూరిటీలో 9 మంది మహిళలకు ఛాన్సిచ్చారు. స్టాలిన్ సెక్యూరిటీలో మొత్తం 9 మంది మహిళలు ఉన్నారు. సీఎం ఎంకే స్టాలిన్ సెక్యూరిటీలో వీళ్లదే కీ రోల్ గా మారింది. సాధారణంగా సీఎంల సెక్యూరిటీలో పురుషులదే కీ రోల్. ఎప్పుడు చూసినా సీఎం వెనుక మనకు కనిపించేది వాళ్లే. కానీ స్టాలిన్ సెక్యురిటీలో మాత్రం మొత్తం 9 మంది మహిళల్ని ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు నియమించారు. సబ్ ఇన్స్‌పెక్టర్ ఎం తనుష్ కన్నకి నేతృత్వంలో ఈ బృందం పని చేస్తుంది.

అత్యంత కఠినమైన శిక్షణ తర్వాత వీళ్లను సీఎం భద్రతా విభాగంలో చేర్చారు. ఇప్పటికీ ప్రతి రోజూ ఉదయం 6 గంటలకే మరుదమ్ కమాండో ట్రైనింగ్ సెంటర్లో వీళ్ల షెడ్యూల్ మొదలవుతుంది. 3 కిలోమీటర్ల పరుగు తర్వాత, రోటీన్ వర్కౌట్స్ ఉంటాయి. గన్స్ వినియోగం, బాంబ్ డిటెక్షన్, క్రౌడ్ మేనేజ్మెంట్, స్ట్రెస్, టైం మేనేజ్మెంట్లో కూడా వీళ్లకు పూర్తి స్థాయి శిక్షణ ఇచ్చిన తర్వాత సీఎం భద్రతా విభాగంలో భాగం చేశారు. వీళ్లు ఈ విభాగంలో అడుగుపెట్టగానే మొట్ట మొదట డీఎంకె కార్యాలయం బాధ్యతల్ని అప్పగించారు. ఆ తర్వాత క్రమంగా సీఎం సెక్యూరిటీలో భాగం చేశారు.

భద్రతా విభాగంలో పని చేస్తున్నారను కనుక సీఎంకి సంబంధించిన అన్ని వివరాలను అత్యంత రహస్యంగా ఉంచాలని ఉద్యోగంలో చేరిన రోజే ప్రమాణం చేయించారు. చివరకు వారి కుటుంబ సభ్యులకు కూడా ఆ వివరాలను పొరపాటున కూడా చెప్పకూడదు. ఎప్పుడూ సీఎం స్టాలిన్ సెక్యూరిటలోనే ఉంటారు కదా.. ఎప్పుడైనా ఆయనతో మాట్లాడారా అని మీడియా ప్రశ్నిస్తే.. ఉద్యోగంలో చేరి సుమారు 9 నెలలు కావస్తున్నా ఒక్కసారి కూడా మాట్లాడలేదని ఎస్ఐ తనుష్ అన్నారు. డ్యూటీలో ఉండగా.. ఇతర విషయాలపై దృష్టి పెట్టే అవకాశమే ఉండదన్నారు తనుష్.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం తమిళనాడు సీఎం సెక్యూరిటీలో ఉన్న 9 మంది మహిళా కమాండోల కథ చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..