Archana Nag: సాక్ష్యాలున్నాయ్.. రాష్ట్రాన్నే షేక్ చేస్తా..! నేను నోరు విప్పితే రాష్ట్రంలో సీన్ మారిపోతుంది..
తన అందంతో ప్రముఖులకు వలపు వల విసిరి వారితో సన్నిహితంగా ఉంటూ వీడియోలు, ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు డిమాండ్ చేసిన కీలేడీ అర్చనానాగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
తన అందంతో ప్రముఖులకు వలపు వల విసిరి వారితో సన్నిహితంగా ఉంటూ వీడియోలు, ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు డిమాండ్ చేసిన కీలేడీ అర్చనానాగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాకు చెందిన ఈ మాయలేడి ఇప్పుడు పోలీసుల కస్టడీలో ఉంది. కాగా అర్చనానాగ్‌ను విచారణకోసం ఈడీ కార్యాలయానికి తరలించారు. అంతకుముందు వైద్య పరీక్షల కోసం ఝార్పడ జైలునుంచి భువనేశ్వర్‌లోని క్యాపిటల్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఈసందర్భంగా అర్చనానాగ్ పలు వ్యాఖ్యలు చేసింది. తన వద్ద ఎక్స్‌క్లూజివ్ సాక్ష్యాలు ఉన్నాయని, ఈడీ దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని చెప్పింది. అంతేకాదు తన వద్ద ఉన్న సాక్ష్యాలతో రాష్ట్రాన్నే గడగడలాడిస్తానని, తాను నోరు విప్పితే రాష్ట్రంలో మొత్తం సీన్ మారిపోతుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తనను ట్రాప్‌లో పడేశారని, ఎవరినీ వదిలిపెట్టనంటూ వ్యాఖ్యలు చేసింది. తానేమీ ఉగ్రవాదిని కాదని.. కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేసిన తీరు, తన కుటుంబాన్ని వేధించిందంటూ పోలీసులపై విమర్శలు చేసింది. మరోవైపు, సెక్స్ రాకెట్‌తో పాటు ధనవంతులను బ్లాక్‌మెయిల్ చేయడం ద్వారా భారీగా కూడబెట్టిన సంపదకు సంబంధించి మనీలాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా డిసెంబర్ 5న ఆమెను ఏడు రోజుల పాటు తమ కస్టడీకి తీసుకున్నారు ఈడీ అధికారులు. డిసెంబర్ 13న తిరిగి ఆమెను జిల్లా సెషన్సు కోర్టులో హాజరుపరుస్తారు. ఇప్పటివరకు ఈ కేసులో ఈడీ తొమ్మిది మందిని విచారించింది. ఈ కేసులో సహ నిందితుడిగా ఉన్న అర్చననాగ్ భర్త జగబంధు చంద్‌ను డిసెంబర్ 7న కోర్టు ముందు హాజరుపరిచింది. 2018 నుంచి కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే భువనేశ్వర్‌లోని సత్యవిహార్‌లో మూడంతస్తుల విశాలమైన బంగ్లాతో పాటు 30కోట్ల ఆస్తులు కూడబెట్టినట్టు అర్చనా నాగ్‌పై ఆరోపణలు వచ్చాయి. ఇందులో భాగంగా ఆమెను అక్టోబర్ 6న పోలీసులు అరెస్టు చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..