America: అమెరికాలో వింతగా ప్రవర్తిస్తున్న ప్రజలు..! జాంబీవైరస్ దాడి మొదలుపెట్టేసిందా.. వీడియో.
కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే ఊపిరి తీసుకుంటున్న ప్రజలకు ఇటీవల శాస్త్రవేత్తలు జాంబీవైరస్ గురించి చెప్పారు. దాంతో ప్రజల్లో మళ్లీ భయం మొదలైంది.
కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే ఊపిరి తీసుకుంటున్న ప్రజలకు ఇటీవల శాస్త్రవేత్తలు జాంబీవైరస్ గురించి చెప్పారు. దాంతో ప్రజల్లో మళ్లీ భయం మొదలైంది. వేల ఏళ్ల కిందట మంచు పలకల కింద మరుగున పడిపోయిన జాంబీ వైరస్ ను పునరుజ్జీవింప చేసినట్టు శాస్త్రవేత్తలు ప్రకటించడం పెద్ద చర్చకు దారితీసింది. పర్యావరణ కాలుష్యం, భూతాపంతో మంచు ఫలకాలు కరిగి, అందులో దాగి ఉన్న భయంకరమైన వైరస్ లు మళ్లీ జీవం పోసుకుంటున్నాయని తెలుస్తోంది. జాంబీల ప్రభావం మానవాళిపై ఎలా ఉంటుందోనని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ఇటీవలే ఓ అధ్యయనం నిర్వహించారు.ఇదిలా ఉంటే ఇప్పుడు అమెరికాలోని ఫిలడెల్ఫియాలో కొందరు వ్యక్తులు రోడ్లపై చిత్ర, విచిత్రంగా ప్రవర్తిస్తున్న వీడియో ఒకటి ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది. అందులో ఒక మహిళ తలను వెనక్కి వాల్చి, అటూ, ఇటూ ఊగిపోతూ ఉంది. తనను తాను కంట్రోల్ చేసుకోడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరోవైపు ఇంకో వ్యక్తి కిందకు వంగిపోయి మద్యం సేవించిన వ్యక్తిలా అటూ ఇటూ తూలుతూ కనిపించాడు. నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు. దీనిపై ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. జాంబీ వైరస్ అప్పుడే మానవాళిపై దాడి మొదలు పెట్టిందా? ఒకరంటే.. బ్రో.. యూఎస్ఏలో అసలేం జరుగుతోంది? అది జాంబీ వైరస్ ప్రభావమా.. డ్రగ్స్ ప్రభావమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..