Stolen Sheep: హైదరాబాద్‌లో వెరైటీ దొంగ.. ఏం ఎత్తుకెళ్లాడో తెలిస్తే షాక్..!వైరల్ వీడియో..

Stolen Sheep: హైదరాబాద్‌లో వెరైటీ దొంగ.. ఏం ఎత్తుకెళ్లాడో తెలిస్తే షాక్..!వైరల్ వీడియో..

Anil kumar poka

|

Updated on: Dec 14, 2022 | 8:28 AM

ఇప్పటి వరకు మనం మొబైల్‌ దొంగలను చూశాం.. ఇళ్లు, బ్యాంకులను దోచుకునే వారిని చూశాం. కానీ ఈ దొంగల రూటే సెపరేటు.. ఎందుకంటే గొర్రెలు, మేకలే వీళ్ల టార్గెట్‌.


ఇప్పటి వరకు మనం మొబైల్‌ దొంగలను చూశాం.. ఇళ్లు, బ్యాంకులను దోచుకునే వారిని చూశాం. కానీ ఈ దొంగల రూటే సెపరేటు.. ఎందుకంటే గొర్రెలు, మేకలే వీళ్ల టార్గెట్‌. ఇంటి ముందు కట్టేసిన గొర్రె పోటేలును దొంగతనం చేస్తూ సీసీ కెమెరాలకు చిక్కాడు ఓ దొంగ.. హైదరాబాద్ టప్పాచబుత్ర ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి గొర్రెల పెంపకం అంటే ఇష్టం ఈ క్రమంలోనే గొర్రె పోటేళ్లను పెంచుతున్నాడు. అయితే, ఇంటి ముందు కట్టేసిన ఒక గొర్రె పోటేలు తెల్లవారేసరికి కనిపించకుండా పోయింది. దాంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదును స్వీకరించిన టప్పాచబుత్ర పోలీసులు సీసీ ఫుటేజ్‌ను పరిశీలించారు. అందులో షూటు, బూటు ధరించిన ఓ వ్యక్తి ఎంచక్కా గొర్రె పోటేలును తోలుకెళ్తున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు గొర్రెల దొంగ కోసం వేట మొదలుపెట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Snake Bathing: నువ్వు తోపువి బాసూ.. కింగ్‌ కోబ్రాకి స్నానమా..! మగ్‌పై పలుమార్లు కాటు వేసిన పాము.. వీడియో.

Romance Before Marriage: పెళ్లికిముందే శృంగారం చేస్తే ఇక అంతే..! కొత్త చట్టం తీసుకురానున్న ప్రభుత్వం.

Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్‌ ప్రకటన..

Published on: Dec 14, 2022 08:28 AM