కన్నతల్లినే ఈడ్చి ఈడ్చి కొట్టిన కూతురు.. పాపం వృద్ధురాలు..

కన్నతల్లినే ఈడ్చి ఈడ్చి కొట్టిన కూతురు.. పాపం వృద్ధురాలు..

Phani CH

|

Updated on: Dec 13, 2022 | 9:40 PM

నాగర్ కర్నూల్ లో దారుణం చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన ఓ మహిళ కనీస మానవత్వం మరిచిపోయింది. కన్నతల్లినే డబ్బులకోసం దారుణంగా కొట్టింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

నాగర్ కర్నూల్ లో దారుణం చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన ఓ మహిళ కనీస మానవత్వం మరిచిపోయింది. కన్నతల్లినే డబ్బులకోసం దారుణంగా కొట్టింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చంద్రమ్మ అనే 70 ఏళ్ల వృద్ధురాలు నాగర్ కర్నూల్ జిల్లా లోని తన కుమార్తె వద్ద ఉంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో పెన్షన్ డబ్బులు ఇవ్వాలంటూ వృద్ధురాలి కూతురు అడిగింది. తాను మందులు కొనుక్కోవాలని డబ్బులు ఇవ్వనని నిరాకరించడంతో మహిళ తీవ్ర ఆగ్రహానికి గురై తల్లిని రోడ్డుపై విచక్షణా రహితంగా కొట్టింది. పక్కనే ఉన్న మహిళ భర్త అత్తను తన భార్య కొడుతుంటే కళ్లప్పగించి చూసాడే తప్ప వద్దని వారించలేదు. తల్లిని రాయితో కొడుతూ చంపేస్తానంటూ రాక్షసిలా విరుచుకుపడింది. వృద్ధురాలివద్దనుంచి పెన్షన్ డబ్బులు లాక్కోవడంతోపాటు చేతి కడియాలు లాక్కొని ఆమెను ఈడ్చి పడేసింది. చుట్టుపక్కల వారు వద్దని వారిస్తే వారిని దుర్భాషలాడుతూ దూషించింది. ఆమె నాతల్లి కొడతాను ఏమైనా చేస్తానంటూ ఆవేశంతో ఊగిపోతూ ఆమెను రోడ్డుపై ఏడ్చి కెళ్ళి కొట్టింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇడ్లీ సాంబార్‌లో బల్లి.. ఏమీకాదు తినొచ్చు అంటున్న హోట్‌ సిబ్బంది

పొదల్లో దాగిన పులిని వీడియో తీస్తుండగా !! ఏం జరిగిందంటే ??

మూడు సింహాల వెనుక ధైర్యంగా అడుగేస్తూ మహిళ !! నెట్టింట వీడియో వైరల్

ఇదేం చికెన్ కుర్మా !! మండిపడుతున్న నెటిజ‌న్లు

మరో ట్యాలెంట్‌ను పట్టేసిన టెక్‌ దిగ్గజం.. ఇతని టాలెంట్ చూసి నెటిజెన్స్ కూడా ఫిదా

 

Published on: Dec 13, 2022 09:40 PM