కంటి నొప్పితో ఓ వృద్ధురాలు ఆస్పత్రికి వెళ్లింది.. శస్త్రచికిత్స చేస్తుండగా డాక్టర్లు షాక్
ఓ వృద్ధురాలి కంటిలో నుంచి 9 సెంటిమీటర్ల పొడవుతో బతికి ఉన్న పురుగును డాక్టర్లు బయటకు తీశారు. ఈ ఘటన కర్ణాటక ఉడుపిలో జరిగింది. కంటినొప్పితో...
ఓ వృద్ధురాలి కంటిలో నుంచి 9 సెంటిమీటర్ల పొడవుతో బతికి ఉన్న పురుగును డాక్టర్లు బయటకు తీశారు. ఈ ఘటన కర్ణాటక ఉడుపిలో జరిగింది. కంటినొప్పితో బాధపడుతున్న ఓ 70 ఏళ్ల వృద్ధురాలు.. కంట్లో విపరీతమైన మంట ఉండటంతో జూన్ 1న చికిత్స కోసం ఉడుపిలోని ప్రసాద్ నేత్రాలయకు వెళ్లింది. పలు టెస్టులు చేసిన డాక్టర్లు ఆమె కంటిలో సజీవంగా ఉన్న ఓ పురుగు ఉన్నట్లు గుర్తించారు. దాని కదలికలను కట్టడి చేసేలా మెడిసిన్ ఇచ్చి ఆమెను ఇంటికి పంపించారు. కానీ, తీవ్రమైన కంటినొప్పి, మంట వేధించగా.. సోమవారం మళ్లీ ఆమె ఆస్పత్రికి వచ్చి.. డాక్టర్లకు తన బాధ చెప్పుకుంది. దాంతో వైద్యులు వెంటనే ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించారు. కంటిలోపలి పొర నుంచి పురుగును బయటకు తీసి.. డాక్టర్లే షాక్‌కు గురయ్యారు. ఈ పురుగుపై మరిన్ని పరిశోధనల కోసం లేబొరేటరీకి పంపించారు.
కళ్లపై ఒక కన్నేసి ఉండండి…
మీ కంట్లో ఏదో నలక ఉన్నట్లుగా అనిపిస్తోందా? అప్పుడప్పుడు మంటగా అనిపిస్తుందా? ఏదైనా నలక పడిందిలే అదే పోతుంది అనుకుంటున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.. అది కంటి నులి పురుగు కావొచ్చు.. పరాన్న జీవి నెమటోడ్ అనే పురుగు మీ కంట్లో నివాసం ఏర్పరుచుకోవచ్చు. సాధారణంగా నులి పురుగులు సన్నగా పొడవుగా ఉంటాయి. బయటకు చూడటానికి తెల్లగా కనిపిస్తాయి. కంట్లో ఈ నులి పురుగులు చాలా పొడవు పెరుగుతాయి. ఎంత అంటే ఒక కేసులో డాక్టర్లు 20 సెం. మీ పొడవైన పురుగును బయటకు తీశారు. ఈ పరాన్నజీవి సంక్రమిస్తే.. కంటి పురుగు సోకిందని పిలుస్తారు. కాబట్టి మీకు కంటిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే డాక్టర్లను సంప్రదించండి.
Also Read: సాధారణ మరణానికి రూ.లక్ష.. ప్రమాదంలో చనిపోతే రూ.5 లక్షలు సాయం!