7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వేతనాల పెంపు, డీఏ బకాయిల చెల్లింపు అప్పుడే.!
సుమారు 52 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షలకు పైగా పెన్షనర్లు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న 7వ వేతన సంఘం ఒప్పందానికి..

సుమారు 52 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షలకు పైగా పెన్షనర్లు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న 7వ వేతన సంఘం ఒప్పందానికి సంబంధించి మరో కీలక అప్‌డేట్ బయటికి వచ్చింది. డీఏ బకాయిల చెల్లింపుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
7వ వేతన సంఘం కొత్త సిఫారసు మేరకు ప్రస్తుతం కేంద్ర ఉద్యోగులకు వారి ప్రాథమిక వేతనంపై 17శాతంగా ఉన్న డీఏను 28 శాతానికి పెంచనున్నారు. ఈ పెరిగిన డీఏతో పాటు వేతనాల పెంపును కూడా సెప్టెంబర్ నుంచి ఉంటుందని అధికారిక వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
అలాగే గత మూడుసార్లుగా వాయిదా పడిన డీఏ, డీఆర్ బకాయిలను కూడా సెప్టెంబర్‌లో చెల్లిస్తారని సమాచారం. కాగా, కరోనా సంక్షోభం నేపధ్యంలో 2020 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కరువు భత్యాన్ని కేంద్రం వాయిదా వేస్తూ వచ్చింది. అటు 7వ వేతన సంఘం ఒప్పందం ప్రకారం.. పెరిగిన జీతంతో పాటు డీఏలు కూడా చెల్లిస్తారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. అది మరోసారి వాయిదా పడింది.
Also Read:
రోజూ ఎన్ని బాదంపప్పులు తినాలి.? అతిగా తింటే ఏమవుతుంది.! ఈ విషయాలు తెలుసుకోండి
వామ్మో.. మొసలితో ఆ పిచ్చి గేమ్స్ ఏంటి అమ్మాయి.? వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఈ ఫ్యాన్సీ నెంబర్‌కు క్రేజ్ మాములుగా లేదు.. ఏకంగా రూ. 7.6 లక్షలకు అమ్ముడైంది.!