డయాబెటిస్‌తో చేదు ఎందుకు తినాలి  ?? అసలు కారణాలు ఇవే

Phani CH

02 April 2025

Credit: Instagram

డయాబెటిస్ ఉన్నవారు చేదు పదార్థాలను ఎందుకు తినాలనే ప్రశ్న చాలామందికి  ఉంటుంది. దీని వెనుక అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్లడ్ షుగర్ నియంత్రణ: చేదు పదార్థాలు అయిన మెంతులు, కాకర లాంటివి  రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి.

ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగు: చేదు రుచి ఉన్న ఆహారాలు శరీరంలో ఇన్సులిన్ పనితీరును మెరుగు పరచడానికి ఎంతగానో తోడ్పడతాయి.

జీర్ణక్రియకు సహాయం: చేదు పదార్థాలు జీర్ణ శక్తిని పెంచి, గ్లూకోజ్ శోషణను నియంత్రించడానికి ఉపయోగపడతాయి.

సైంటిఫిక్ బ్యాకప్: అధ్యయనాల ప్రకారం, చేదు సమ్మేళనాలు గ్లూకోజ్ మెటబాలిజంను మెరుగుపరుస్తాయని తేలింది.

ఉదాహరణలు: కాకరకాయ, మెంతి గింజలు,  వేపాకు వంటివి డయాబెటిస్ నిర్వహణలో ప్రభావవంతంగా ఉంటాయి.

చేదు పదార్ధాలు తినడం ఒక డయాబెటిక్ రోగులకు ఒక సహజ ఔషధం. డయాబెటిస్ నియంత్రణకు చేదు ఆహారాలు సహజమైన, సురక్షితమైన మార్గం.