AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mango Production: మామిడి సాగులో దూసుకెళ్తున్న రాష్ట్రాలు.. తెలుగు రాష్ట్రాలది ఎన్నో స్థానం అంటే..

మామిడి పండ్ల సీజన్ వచ్చింటేనే వేల కోట్ల బిజినెస్ మొదలవుతుంది. మన దేశంలో ఈ పండ్లకు ఉండే గిరాకీనే వేరు. ఒక్క ఎండాకాలంలోనే వేల హెక్టార్ల మామిడిని భారత్ ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోంది. అందులో కొన్ని రాష్ట్రాలు కీలకంగా ఉన్నాయి. ఆయా రాష్ట్రాలు ఈ సాగులో దూసుకుపోతున్నాయి. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా గట్టి పోటీనివ్వడం విశేషం..

Mango Production: మామిడి సాగులో దూసుకెళ్తున్న రాష్ట్రాలు.. తెలుగు రాష్ట్రాలది ఎన్నో స్థానం అంటే..
Mango Production In India
Follow us
Bhavani

|

Updated on: Apr 02, 2025 | 7:15 PM

భారత్ కు మామిడి జాతీయపండు. దీన్ని పండ్లలో రారాజుగా పిలుస్తారు. మన దేశంలో అనేక రకాల రుచులు, ఆకారాలు, రంగులతో మామిడి పండ్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్క మనదేశంలోనే 1500 రకాల మామిడి వెరైటీలు ఉన్నాయంటే నమ్మశక్యం కాదు. అందులోనూ ఒక్కో వెరైటీ ఒక్కో రకమైన రుచిని కలిగి ఉంటాయి. అల్ఫోన్సో, కేసర్, దశేరి, తోతాపురి, హిమసముద్ర, లంగ్రా, బేంగణపల్లి, జునగర్ మలక్ వంటివి భారతదేశంలో అత్యంత ప్రసిద్ధమైన మామిడి రకాలు. అయితే, మన దేశంలో మామిడి పండ్లను పండిస్తున్న రాష్ట్రాలలో ఇవి అగ్ర స్థానంలో ఉన్నాయి. వీటి సాగు, ఎగుమతులు దేశాన్ని మరింత సంపన్నం చేస్తున్నాయి. మరి వీటిలో తెలంగాణ, ఏపీ ఏ స్థానంలో ఉన్నాయి? మన దగ్గర వీటి వల్ల ఎంత బిజినెస్ అవుతుందో తెలుసుకుందాం..

ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాలు:

ఉత్తరప్రదేశ్: సుమారు 264.93 వేల హెక్టార్ల విస్తీర్ణంలో, 4540.23 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో అగ్రస్థానంలో ఉంది.

ఆంధ్రప్రదేశ్: సుమారు 332.97 వేల హెక్టార్ల విస్తీర్ణంలో, 3163.32 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో రెండవ స్థానంలో ఉంది.

కర్ణాటక: సుమారు 192.61 వేల హెక్టార్ల విస్తీర్ణంలో, 1829.21 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో మూడవ స్థానంలో ఉంది.

తెలంగాణ: సుమారు 180.62 వేల హెక్టార్ల విస్తీర్ణంలో, 1681.6 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో నాల్గవ స్థానంలో ఉంది.

బీహార్: సుమారు 150.64 వేల హెక్టార్ల విస్తీర్ణంలో, 1479.58 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో ఐదవ స్థానంలో ఉంది.

గుజరాత్: సుమారు 153.18 వేల హెక్టార్ల విస్తీర్ణంలో, 1241.59 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో ఆరవ స్థానంలో ఉంది.

తమిళనాడు: సుమారు 160.94 వేల హెక్టార్ల విస్తీర్ణంలో, 1156.99 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో ఏడవ స్థానంలో ఉంది.

మామిడి ఎగుమతులు:

జాతీయ ఉద్యానవన బోర్డు ప్రకారం, 2002-03లో భారతదేశం మామిడి పండ్ల ఎగుమతులు సుమారు 45,000 టన్నులుగా అంచనా వేశారు. దీని విలువ రూ. 100 కోట్లు (రూ. 1 బిలియన్). తాజా మామిడి పండ్లు బంగ్లాదేశ్, యుఎఇ, సౌదీ అరేబియా, యూకేకు ఎగుమతి చేస్తున్నారు. అయితే మామిడి గుజ్జు యుఎఇ, సౌదీ అరేబియా, కువైట్, నెదర్లాండ్స్, యుఎస్ఎ యుకెలకు పంపుతున్నారు.

సొంత వ్యాఖ్యలు చేయొద్దు.. కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ వార్నింగ్
సొంత వ్యాఖ్యలు చేయొద్దు.. కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ వార్నింగ్
'ఎంత తోప్ బౌలరైనా భయపడేది లే'.. సూర్యవంశీ షాకింగ్ కామెంట్స్
'ఎంత తోప్ బౌలరైనా భయపడేది లే'.. సూర్యవంశీ షాకింగ్ కామెంట్స్
హల్దీ వేడులకల్లోకి డైనోసోర్.. గెటప్‌ తీసి చూడగా అశ్చర్యపోయిన..
హల్దీ వేడులకల్లోకి డైనోసోర్.. గెటప్‌ తీసి చూడగా అశ్చర్యపోయిన..
ఈ టైమ్‌లో నడిస్తే బరువు ఇట్టే తగ్గుతారు..
ఈ టైమ్‌లో నడిస్తే బరువు ఇట్టే తగ్గుతారు..
వణికిపోతున్న పాకిస్తాన్.. పీఓకేలోని ఉగ్ర శిబిరాలు ఖాళీ..!
వణికిపోతున్న పాకిస్తాన్.. పీఓకేలోని ఉగ్ర శిబిరాలు ఖాళీ..!
ఏడూ, ఎనిమిదిమందిని ప్రేమించా.. 23 ఏళ్లకే అన్ని చూసేశా..
ఏడూ, ఎనిమిదిమందిని ప్రేమించా.. 23 ఏళ్లకే అన్ని చూసేశా..
చిరంజీవికి చెల్లిగా.. భార్యగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా..?
చిరంజీవికి చెల్లిగా.. భార్యగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా..?
14 ఏళ్ల కుర్రాడి ఊచకోత.. పాయింట్ల పట్టికలో గుజరాత్‌కు బిగ్ షాక్?
14 ఏళ్ల కుర్రాడి ఊచకోత.. పాయింట్ల పట్టికలో గుజరాత్‌కు బిగ్ షాక్?
గాయపడిన కేటీఆర్‌.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ట్వీట్..
గాయపడిన కేటీఆర్‌.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ట్వీట్..
11 సిక్స్‌లు, 7 ఫోర్లు.. 265 స్ట్రైక్‌రేట్‌తో సూర్యవంశీ బీభత్సం
11 సిక్స్‌లు, 7 ఫోర్లు.. 265 స్ట్రైక్‌రేట్‌తో సూర్యవంశీ బీభత్సం