AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brain Dead: రోడ్డు ప్రమాదంలో మరణించి.. మరో 8 మందికి పునర్జన్మనిచ్చిన టైలర్..

Organs Donated: రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించిన వ్యక్తి.. మరో ఎనిమిది మందికి పునర్జన్మనిచ్చాడు. రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డి బ్రెయిన్ డెడ్ అయిన

Brain Dead: రోడ్డు ప్రమాదంలో మరణించి.. మరో 8 మందికి పునర్జన్మనిచ్చిన టైలర్..
Organs Transplant
Shaik Madar Saheb
|

Updated on: Jun 10, 2021 | 11:16 AM

Share

Organs Donated: రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించిన వ్యక్తి.. మరో ఎనిమిది మందికి పునర్జన్మనిచ్చాడు. రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డి బ్రెయిన్ డెడ్ అయిన వ్య‌క్తి అవ‌య‌వాలను.. అతని కుటుంబసభ్యులు దానం చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్‌లో చోటుచేసుకుంది. సింగ‌న‌ల్లూర్ నివాసి ఆర్‌.చెంత‌మ‌రాయ్ (51). టైలర్‌గా పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే.. చెంతమరాయ్ జూన్ 6న రోడ్డు ప్ర‌మాదానికి గుర‌య్యాడు. కాగా మంగ‌ళ‌వారం.. అతని పరిస్థితి విషమించి.. బ్రెయిన్ డెడ్‌ అయ్యాడని కోయంబ‌త్తూరులోని కోవై మెడిక‌ల్ సెంట‌ర్ అండ్ ఆసుపత్రి వైద్యులు ప్ర‌క‌టించారు. దీంతో కుటుంబస‌భ్యులు ఆ మరణించిన వ్యక్తి అవ‌య‌వాలు దానం చేసేందుకు ముందుకు వ‌చ్చారు.

దీంతో వైద్యులు చకచకా అవయవాలను తీసి అవసరమైన మరో ఎనిమిది మందికి కొత్తజీవితాన్ని ప్రసాదించారు. లివ‌ర్‌, కిడ్నీని కేఎంసీహెచ్‌లో ఓ వ్య‌క్తికి ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. మ‌రో కిడ్నీని వెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి, గుండెను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రికి, కళ్లు, చ‌ర్మం, బోన్‌ను కోయంబ‌త్తూరులోని మ‌రో ప్రైవేటు ఆసుపత్రికి సకాలంలో త‌ర‌లించి బాధితుల‌కు ట్రాన్స్‌ప్లాంట్ చేసినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే.. ఆ కుటుంబసభ్యులు తీసుకున్న నిర్ణయంపై పలువురు అభినందిస్తూ.. వారికి సంతాపం తెలియజేస్తున్నారు.

Also Read:

Covaxin phase 4: కోవాగ్జిన్ వ్యాక్సిన్ 4 దశ ట్రయల్ కి సిద్ధపడిన భారత్ బయోటెక్ కంపెనీ.. త్వరలో మూడో ట్రయల్ ఫలితాల ప్రకటన..

PM Narendra Modi: ‘మోదీజీ.. షేవ్ చేసుకోండి’.. రూ. 100 మనియార్డర్ చేసిన చాయ్‌వాలా..