మధ్యప్రదేశ్ లో 50 బ్లాక్ ఫంగస్ కేసులు, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ ఆందోళన, అదుపునకు అన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటన

మధ్యప్రదేశ్ లో 50 బ్లాక్ ఫంగస్ కేసులు బయట పడ్డాయి. మ్యూకోర్ మైసిన్ గా వ్యవహరించే ఈ ఫంగస్ కేసులు ప్రాణాంతకమైనవి కూడా అంటున్నారు.

  • Publish Date - 10:05 pm, Wed, 12 May 21 Edited By: Phani CH
మధ్యప్రదేశ్ లో 50 బ్లాక్ ఫంగస్ కేసులు, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ ఆందోళన, అదుపునకు అన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటన
Black Fungus

మధ్యప్రదేశ్ లో 50 బ్లాక్ ఫంగస్ కేసులు బయట పడ్డాయి. మ్యూకోర్ మైసిన్ గా వ్యవహరించే ఈ ఫంగస్ కేసులు ప్రాణాంతకమైనవి కూడా అంటున్నారు. తమ రాష్ట్రంలో ఇన్ని కేసులు బయట పడడం చాలా హరిఫిక్ అని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఈ కేసుల విషయంలో మొదట తాము సందేహం వ్యక్తం చేశామని, కానీ డాక్టర్లు దీన్ని నిర్ధారించారని ఆయన చెప్పారు. దీనిపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బ్లాక్ ఫంగస్ కారణంగా ముఖ్యంగా కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని అంటున్నారు. కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నవారు, లేదా కోలుకుంటున్నవారిలో ఈ లక్షణాలు కనబడతాయని, వారిలో తలనొప్పి, జ్వరం, కొన్ని కేసుల్లో మళ్ళీ శ్వాస సరిగా తీసుకోలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. మరీ తీవ్రమైన కేసుల్లో ముక్కును, దవడను కూడా తొలగించవలసి రావచ్చునని వారు పేర్కొన్నారు. ఢిల్లీ,మహారాష్ట్రలో ఇలాంటి కొన్ని కేసులను ప్రస్తావించిన డాక్టర్లు రోగులను ఆసుపత్రుల్లో అడ్మిట్ చేసుకున్నారు. కాగా ఈ బ్లాక్ ఫంగస్ కు గురైన వారి చికిత్సకు అవసరమైన ప్రోటోకాల్ ను తమ ప్రభుత్వం డెవలప్ చేస్తుందని శివరాజ్ సింగ్ చౌహన్ తెలిపారు. ముఖ్యంగా దీనికి గురైన పేదల చికిత్సకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
అటు-దేశంలో దీనిపై ఇంకా రీసెర్చర్లు పరిశోధనలు చేస్తున్నారు. కోవిద్ లక్షణాలకు దీనికి మధ్య పోలికలను వారు అధ్యయనం చేస్తున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:  Corona in Tollywood: టాలీవుడ్ ను వెంటాడుతున్న క‌రోనా విషాదాలు.. సీనియ‌ర్ సంగీత ద‌ర్శ‌కుడు మృతి

Corona Recovery: తెలంగాణ గాంధీ ఆస్పత్రిలో అద్భుతం.. కరోనాను జయించిన 110 ఏళ్ల వృద్ధుడు..